E-Paper
Advertisement

CSK: 31 బంతుల్లో సెంచ‌రీ..చెన్నై బ్యాట‌ర్ అరాచకం, ఇక ఐపీఎల్ 2026లో ప్ర‌త్య‌ర్థుల‌కు న‌ర‌క‌మే

CSK: 31 బంతుల్లో సెంచ‌రీ..చెన్నై బ్యాట‌ర్ అరాచకం, ఇక ఐపీఎల్ 2026లో ప్ర‌త్య‌ర్థుల‌కు న‌ర‌క‌మే
Advertisement

CSK: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament) దగ్గర పడుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన డేంజర్ ఆటగాడు దుమ్ము లేపే బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. టోర్నమెంట్ ప్రారంభాని కంటే ముందే ప్రత్యర్థులకు డేంజర్ బెల్స్ పంపించాడు. అతను ఎవరో కాదు చెన్నై యంగ్ కుర్రాడు ఉర్విల్ పటేల్ ( Urvil Patel). కేవలం 31 బంతుల్లోనే ఉర్విల్ పటేల్ సెంచరీ సాధించాడు. దీంతో సోషల్ మీడియాలో ఉర్విల్ పటేల్ పేరు మారుమోగుతోంది. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ( Syed Mushtaq Ali Trophy 2025) భాగంగా 31 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు ఉర్విల్ పటేల్. 2024 టోర్నమెంట్ సమయంలో కూడా ఉర్విల్ పటేల్ 28 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. గత సంవత్సరం నవంబర్ 27వ తేదీన సెంచరీ సాధించగా, ఈ సీజన్ లో నవంబర్ 26 అంటే ఇవాళ 31 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇక ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings) యాజమాన్యం ఫుల్ జోష్ లో కనిపిస్తోంది.

Also Read: T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

Advertisement

 

31 బంతుల్లో సెంచ‌రీ..చెన్నై బ్యాట‌ర్ అరాచకం

సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఎలైట్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ గుజరాత్ వర్సెస్ సర్వీసెస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో మొదట సర్వీసెస్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయిన సర్వీసెస్ జట్టు 172 పరుగులు సాధించింది. సర్వీసెస్ జట్టులో గౌరవ్ ఒక్కడే 60 పరుగులు సాధించగా మిడిల్ ల్యాండర్ లో వచ్చిన అరుణ్ కుమార్ 29 పరుగులతో రెచ్చిపోయాడు. జయంత్ గోయ‌ట్ కూడా 20 పరుగులతో దుమ్ము లేపాడు. 183 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో గుజరాత్ అద్భుతంగా రాణించింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, గుజరాత్ కెప్టెన్ ఉర్విల్ పటేల్ 37 బంతుల్లోనే 119 పరుగులతో రెచ్చిపోయాడు. ఇందులో 12 బౌండరీలతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. 321 స్ట్రైక్ రేట్ తో రఫ్ ఆడించాడు. ఆర్య దేశాయ్ 60 పరుగులతో రఫ్పాడించాడు. దీంతో 12.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన గుజరాత్ , 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీ సాధించిన కెప్టెన్ ఉర్విల్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ సిరీస్ దక్కింది.

చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలో ఊపు

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఉర్విల్ పటేల్ లాంటి యంగ్ కుర్రాడు సెంచరీ తో దుమ్ము లేపడం చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యంలో కొత్త ఊపును తీసుకువస్తుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో 30 లక్షలకే ఉర్విల్ పటేల్ ను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు హ్యాపీగా ఉంది. వచ్చే సీజన్ లో ఇతన్ని బాగా వాడుకునేందుకు ప్లాన్ చేస్తోంది.

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×