E-Paper
Advertisement

అభిమానులపై మళ్లీ ఫైర్ అయిన బాలయ్య.. విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్!

అభిమానులపై మళ్లీ ఫైర్ అయిన బాలయ్య..  విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్!
Advertisement

Balakrishna Controversy: బాలకృష్ణ..టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ నటసింహం తన 66వ బర్త్ డేని ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే.ఇక ఈ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో అభిమానుల కోసం ప్రత్యేకంగా ఒక ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేశారు కూడా.తమ అభిమాన హీరోను గ్లింప్స్ లో చూసి, ఆయనతో కలిసి ఒక ఫ్రేమ్‌లో నిలబడాలని అభిమానులు ఏంటో మంది అక్కడికి చేరుకున్నారు.

ఒక్కసారిగా ఫైర్ అయిన బాలయ్య

అయితే సెలబ్రిటీలు ఉన్నచోట తోపులాటలు కామన్. బాలయ్యను దగ్గరగా చూడాలనే ఆరాటంలో కొందరు అభిమానులు ఒక్కసారిగా సెక్యూరిటీని దాటుకుని ముందుకు దూసుకొచ్చారు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది.అభిమానుల అత్యుత్సాహం చూసి బాలయ్య ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు.ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లండి అంటూ గట్టిగా కేకలు వేశారు. అనుకోని ఈ పరిణామానికి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇపుడు నెట్టింట వైరల్ అవుతున్నాయ్.

Advertisement

also read :94 ఏళ్ల ‘భీష్మాచార్యుడు’ సింగీతంపై మెగాస్టార్ చిరంజీవి క్రేజీ పోస్ట్.. నెట్టింట వైరల్!

Advertisement

నిజానికి బాలకృష్ణకు ఇలా కోపం రావడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్నో ఈవెంట్లలో, సినిమా షూటింగ్ స్పాట్లలో, పొలిటికల్ క్యాంపెయిన్ లలో అభిమానులపై, తోటి సిబ్బందిపై ఆయన చేయి చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.ఇక గతంలో వచ్చిన లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాల సక్సెస్ మీట్స్‌లో కూడా ఇలాంటి చిన్నపాటి రుసరుసలు కనిపించాయి కూడా.

బాలయ్య బాబు రూటే సెపరేటు

ఇదిలా ఉంటె ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఎప్పటిలాగే రెండు వర్గాలుగా చీలిపోయారు. బాలయ్య బాబు రూటే సెపరేటు, ఆయన కోపమైనా ప్రేమైనా మొహమాటం లేకుండా చూపిస్తారని ఆయన ఫ్యాన్స్ సమర్థిస్తుంటే, నెటిజన్లు మాత్రం ఎంత పెద్ద హీరో అయినా అభిమానుల వల్లే కదా ఈ స్థాయికి వచ్చింది, కనీసం ఆ మాత్రం ఓపిక లేకపోతె ఎలా అని ఎదురు క్వశ్చన్ చేస్తున్నారు.

also read :బాలయ్య సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా రాజశేఖర్?.. కొరటాల శివ స్కెచ్ మామూలుగా లేదుగా!

ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసేదే 

ఇక సినిమాల విషయానికి వస్తే ..బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. దీనితో పాటు కొరటాల సినిమా కూడా లైనప్ లో కనిపిస్తుంది.ఏది ఏమైనా పుట్టిన రోజు నాడే ఇలా మరోసారి కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం బాలయ్య ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసేదే !

Related News

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

నరేష్ మాటలకు స్టేజ్ దిగి వెళ్లిపోయిన బ్రహ్మాజీ.. అంత మాట అనేశాడు ఏంటి?

బాలకృష్ణను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి!

వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?

Big Stories

Advertisement
×