E-Paper
Advertisement

Alia -Ranbir Kapoor: రూ.250 కోట్ల ఇంట్లోకి అడుగుపెట్టిన అలియా రణబీర్ దంపతులు.. ఫోటోలు వైరల్!

Alia -Ranbir Kapoor: రూ.250 కోట్ల ఇంట్లోకి అడుగుపెట్టిన అలియా రణబీర్ దంపతులు.. ఫోటోలు వైరల్!
Advertisement

Alia -Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్స్ అలియా భట్(Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor) దంపతులు ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా బిజీగా ఉండే ఈ జంట సోషల్ మీడియా వేదికగా తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే తాజాగా అలియా భట్ సోషల్ మీడియా వేదికగా తన కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొత్తింట్లో రాహా పుట్టినరోజు…

ఈ దంపతులు ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తమ అభిరుచులకు అనుగుణంగా రూ.250 కోట్ల రూపాయలతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించబోతున్నారు అంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఈ ఇంట్లోకి అలియా భట్ దంపతులు అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితమే ఈ గృహప్రవేశ కార్యక్రమం పూర్తి అయినప్పటికీ అలియా భట్ చాలా ఆలస్యంగా ఈ ఫోటోలను షేర్ చేశారని తెలుస్తోంది. దీపావళి పండుగను పురస్కరించుకొని కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. నవంబర్ 6వ తేదీన కుమార్తె రాహ(Raaha) పుట్టినరోజు వేడుకలను కూడా ఈ ఇంట్లోనే జరిపినట్టు తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది.

కూతురికి కానుకగా రు.250 కోట్ల ఇల్లు..

Advertisement

ఈ విధంగా ఈ దంపతులు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటోలపై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ దంపతులు ఇంత ఖరీదైన ఇంటిని తమ కుమార్తె రాహా పేరుమీద రాశారని తెలుస్తోంది. తమ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ దంపతులు ఈ ఖరీదైన ఇంటిని తన కుమార్తెకు కానుకగా ఇచ్చినట్లు బాలీవుడ్ సమాచారం. పలువురు సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగినట్టు తెలుస్తోంది.

Advertisement

ఇక అలియా భట్ కెరియర్ విషయానికి వస్తే త్వరలోనే అలియా ఆల్ఫా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రణబీర్ కూడా ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే మొదటి భాగం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. సీతగా సాయి పల్లవి, రావణాసురుడి పాత్రలో యష్ నటిస్తున్నారు. ఈ సినిమా 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Also Read: Chiranjeevi: చిరు గొప్ప మనసు..మేనేజర్ కూతురికి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్…

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×