E-Paper
Advertisement

Australia PM Marriage: 62 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి.. అలా చేసిన మొదటి ప్రధానిగా రికార్డు

Australia PM Marriage: 62 ఏళ్ల వయసులో వివాహ బంధంలోకి.. అలా చేసిన మొదటి ప్రధానిగా రికార్డు
Advertisement

Australia PM Marriage: ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, జోడీ హైడెన్‌ను వివాహం చేసుకున్నారు. దీంతో పదవిలో ఉండగా వివాహం చేసుకున్న మొదటి ఆస్ట్రేలియా ప్రధానిగా ఆయన రికార్డుకెక్కారు. శనివారం మధ్యాహ్నం కాన్‌బెర్రాలోని అల్బనీస్ అధికారిక నివాసంలో వివాహ వేడుక జరిగింది. అల్బనీస్ కుమారుడు నాథన్, హైడెన్ తల్లిదండ్రులు బిల్, పౌలిన్‌తో సహా సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. 62 ఏళ్ల వయసులో అల్బనీస్ వివాహం చేసుకోవడం గమనార్హం.

“మా కుటుంబం, సన్నిహిత స్నేహితుల ముందు, మా భవిష్యత్తును కలిసి గడపడానికి మా ప్రేమ, నిబద్ధతను పంచుకోవడానికి మేము పూర్తిగా సంతోషిస్తున్నాము” అని అల్బనీస్, హైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జోడీ హైడెన్ వివాహ ధృవీకరణ పత్రంపై సంతకాలు చేశారు. వివాహ వేడుకలో హైడెన్ సిడ్నీ డిజైనర్ రొమాన్స్ వాజ్ బోర్న్ రూపొందించిన దుస్తులను ధరించగా, ప్రధాని సూట్ ను ఎంజే బేల్ రూపొందించారు. వివాహ ఉంగరాలను సిడ్నీలోని లీచార్డ్ట్‌లోని సెరోన్ జ్యువెలర్స్ రూపొందించింది.

Advertisement

అల్బనీస్, హైడెన్ మొదటిసారి ఐదు సంవత్సరాల క్రితం మెల్‌బోర్న్‌లో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో కలుసుకున్నారు. ఫిబ్రవరి 2024లో వాలెంటైన్స్ డే నాడు కాన్‌బెర్రా రెస్టారెంట్‌లో అల్బనీస్ హైడెన్‌కు ప్రపోజ్ చేశారు. అనంతరం బహిరంగ కార్యక్రమాలలో, అధికారిక విదేశీ పర్యటనలలో, ఎన్నికల ప్రచారాల సమయంలో అల్బనీస్‌తో హైడెన్ కనిపించేవారు.

2019లో విడాకులు

Advertisement

అల్బనీస్ తన మాజీ భార్య, న్యూ సౌత్ వేల్స్ మాజీ డిప్యూటీ ప్రీమియర్ కార్మెల్ టెబ్బట్ నుంచి 2019లో విడిపోయారు. వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం అయింది. హైడెన్ ఎన్ఎస్డబ్ల్యూ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్‌లో పనిచేస్తున్నారు. గతంలో సూపర్‌యాన్యుయేషన్ రంగంలో కీలక పాత్ర పోషించారు. ఆమె సిడ్నీలోని బ్యాంక్‌స్టౌన్‌లో జన్మించారు.

Also Read: Donald Trump: మూడో ప్రపంచ దేశాలపై ట్రంప్ సీరియస్.. వలసలు నిలిపివేస్తామని వార్నింగ్

కాన్ బెర్రాలోని ప్రధాని ఆంథోని అధికారిక నివాసం ది లాడ్జ్ తోటలో అత్యంత సన్నిహితుల మధ్య వివాహ వేడుక జరిగింది. పెళ్లి విషయాన్ని ప్రధాని ఆంథోని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామితో కలిసి నడిచి వస్తున్న వీడియోలను ప్రధాని సోషల్ మీడియోలో పోస్టు చేశారు. ఐదేళ్ల క్రితం మొదలైన వీరి ప్రయాణం.. తాజాగా వివాహ వేడుకతో ఒక్కటయ్యారు.

Tags

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×