E-Paper
Advertisement

F1 OTT Release Date : ఓటీటీలోకి 5598 కోట్ల హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

F1 OTT Release Date : ఓటీటీలోకి 5598 కోట్ల హాలీవుడ్ రేసింగ్ థ్రిల్లర్… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

F1 OTT Release Date : బ్రాడ్ పిట్ నటించిన ‘F1’ థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉంది. ఫార్ములా రేసింగ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ భారీ చిత్రం థియేటర్లలో కేకలు పెట్టించింది. ఇప్పుడు అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా $631 మిలియన్లను వసూలు చేసి, బ్రాడ్ పిట్ కెరీర్‌లో నే అతిపెద్ద బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇది ఒక్క భారత దేశంలోనే 125 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. రియల్ ఫార్ములా రేసర్లతో ఈ సినిమా రియలిస్టిక్ గా ఉంటుంది. క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోనీకుండా చేస్తోంది. ఇక థియేటర్లలో మిస్ అయిన అభిమానులు ఇంటి నుండే ఈ హై-స్పీడ్ షోను చూసేయండి. ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

స్ట్రీమింగ్ ఎప్పుడంటే

‘ఎఫ్1’ 2025లో విడుదలైన అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా సినిమా. ఇది జోసెఫ్ కోసిన్స్కీ దర్శకత్వంలో రూపొందింది. 2025 జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 2025 డిసెంబర్ 12 నుంచి Apple TV+, Amazon Prime లో స్ట్రీమింగ్ కి వస్తోంది. ఇందులో బ్రాడ్ పిట్ సాన్నీ హేస్ పాత్రలో నటించాడు. 2 గంటల 35 నిమిషాల నిడివితో ఇది ఐయండిబిలో 7.7/10 రేటింగ్ పొందింది. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులోకి వస్తోంది.

స్టోరీలోకి వెళ్తే 

సాన్నీ హేయెస్ (బ్రాడ్ పిట్) అనే వ్యక్తి ఫార్ములా రేస్ లో దూకుడుగా ఉంటాడు. బండి ఎక్కాడంటే అందరి చూపు అతనివైపే. రయ్ రయ్ మంటూ దూసుకెళ్తూ ఎన్నో విజయాలను అందుకున్నాడు. అయితే 30 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన యాక్సిడెంట్ తరువాత F1 రేసింగ్ మానేసి, ఇప్పుడు చిన్న చిన్న రేసుల్లో డబ్బుల కోసం పందాలు కాస్తూ మామూలుగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతని పాత ఫ్రెండ్ రూబెన్ ఫోన్ చేసి, తన F1 టీమ్ APXGP దివాలా తీసే దశలో ఉందని, దాన్ని కాపాడాలంటే నీవు వచ్చి డ్రైవర్ జోష్వా ని ట్రైన్ చేయాలని అడుగుతాడు. సాన్నీ మొదట ఒప్పుకోకపోయినా, లైఫ్‌లో ఒక్కసారి మళ్లీ గొప్పగా ఏదైనా చేయాలని ఒప్పుకుని టీమ్‌లో చేరతాడు. టీమ్‌లో ఇంజినీర్ కేట్, మెకానిక్స్ అందరూ కలిసి మోటివ్ చేస్తారు. ఒక్క అప్‌గ్రేడ్‌తోనే లాస్ట్ ప్లేస్ నుంచి టాప్‌కి ఎక్కేస్తారు.

Read Also : భార్యను టార్చర్ చేసే భర్త… పెళ్ళామే కదాని లైట్ తీసుకుంటే చిప్పులు ఎగిరిపోయే షాకిచ్చింది మావా

ఈ సమయంలో సాన్నీకి పాత యాక్సిడెంట్ గుర్తొచ్చి భయం వేస్తుంది. జోష్వా ఇప్పుడు వచ్చిన విజయంతో గర్వంగా ఉంటాడు. అయితే ఇద్దరి మధ్య ఈగో క్లాష్‌లు జరుగుతూనే రేసులు గెలుస్తూ వెళ్తారు. జోష్వా ఒక్కడితో టీమ్ పాయింట్స్ రావట్లేదని, టీమ్ లో రెండో బండిని సాన్నీ కూడా నడుపుతాడు. ఇద్దరి మధ్య ఒక యుద్ధంలా ఈ రేస్ నడుస్తుంది. చివరికి ఫైనల్ చాంపియన్‌షిప్ రేసు వస్తుంది. ఈ రేస్ లో సాన్నీ కళ్లు బ్లర్ అయిపోతున్నా, పాత గాయాలు మళ్లీ వచ్చినా బండి ఎక్కి రేస్ లో పాల్గొంటాడు. జోష్వా కూడా సూపర్ డ్రైవింగ్ చేసి గెలవడానికి ప్రయత్నిస్తాడు. ఇది ఒక యుద్ధంలా జరుగుతుంది. ఈ ఫైనల్ రేస్ లో వీళ్ళు గెలుపును అందుకుంటారా ? టీమ్ దివాలా నుంచి బయటపడుతుందా ? అనే విషయాలను, ఈ అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా సినిమాని చూసి తెలుసుకోండి.

 

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×