E-Paper
Advertisement

Shivaji: బ్రేక్ ఫాస్ట్, లంచ్ తర్వాతే మార్నింగ్, మ్యాట్నీలు.. మరి పాప్ కార్న్ ఎందుకొచ్చింది

Shivaji: బ్రేక్ ఫాస్ట్, లంచ్ తర్వాతే మార్నింగ్, మ్యాట్నీలు.. మరి పాప్ కార్న్ ఎందుకొచ్చింది
Advertisement

Actor Shivaji Comments on Popcorn: టికెట్ రేట్స్, పాప్ కార్న్ రేట్స్ సామాన్యుడిని భయపెడుతున్నాయి. పీవీఆర్, ఐమ్యాక్స్, ఐనాక్స్ లో సినిమాలు చూడాలంటే ముందు ఆలోచించేది పాప్ కార్న్ రేట్ గురించే. తాజాగా ఇదే అంశంమై శివాజీ స్పందించారు. అసలు ఈ లోకంలో చీప్ దొరికేది సినిమా ఒక్కటే అన్నారు. మూడు గంటల సినిమా కేవలం మూడు నాలుగు వందల్లోనే దొరుకుంది. సైలెంట్ సినిమా చూసి రాకుండ ఈ పాప్ కార్న్ గోల ఏంటండి అన్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దండోరా’.

సినిమాని థియేటర్లలోనే చూడండి..

Advertisement

డిసెంబర్ 25న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (నవంబర్ 17) మూవీ టీజర్ విడదుల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్ మాట్లాడుతూ శివాజీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ సందర్బంగా మూవీ పైరసీ కింగ్ పిన్ ఇమ్మడి రవి టాలెంట్ ని ప్రశ్నించారు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి దాన్ని తప్పు దారిలో ఉపయోగించడమే బాధకరమన్నారు. అయినా సినిమాను థియేటర్లలో చూస్తేనే మజా అన్నారు. మా సినిమా అనే కాదు ఏ సినిమా అయినా థియేటర్లలోనే చూడాలి. అప్పుడే మంచి మజా వస్తుంది. పాప్ కార్న్ అంటే.. మా ఊర్లో పోలంలో పాప్ కార్న్ వేసి సప్లై చేయాలి. లేదంటే నేనేం చేయలేను.

చూసి చూడనంటూ వెళ్లిపోవాలి

 పాప్ కార్న్ కి, సినిమాకి ముడిపెడట్టడమేంటో అర్థం కావడం లేదు. రేట్స్ ఎక్కువ అంటే ఆఖరికి పార్కింగ్ లను ఫ్రీ చేశారు. ఇంకేం చేయాలి. కానీ సినిమా అనగానే దోపిడి అంటూ నిరసన చేస్తున్నారు. ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఉంటాయి. చూసి చూడనంటూ వెళ్లిపోతుండాలిఅని చెప్పుకొచ్చాడు. ఇక పక్కన ఉన్న నవదీప్.. అసలు సినిమాకు, పాప్ కార్న్ సంబంధమేంటంటూ వివరణ ఇచ్చారు. మార్నింగ్ షో బ్రేక్ ఫాస్ట్ తర్వాతే.. లంచ్ తర్వాతే మ్యాట్నీ, స్నాక్స్ తర్వాతే ఫస్ట్ షో, డిన్నర్ తర్వాత సెకండ్ షో.. మరి ఎక్కడ నుంచి వచ్చిందని ముచ్చటించారు. సినిమాక, పాప్ కార్న్ అసలు ముడిపెట్టకుండ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని సూచించారు. కాగా నేడు విడుదలైన దండోరా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఆకట్టుకుంటున్న దండోరా టీజర్

Advertisement

ముఖ్యంగా టీజర్ లోని డైలాగ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమాను మొరళీ కాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. రవీంద్ర బెనర్యజీ ముప్పనేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, వీడియో, పాటలు ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన టీజర్ గొడవలు, ప్రేమలు అన్నింటిని చూపించారు. చావు చూట్టు తిరిగిన ఈ టీజర్ శివాజీ డైలాగ్ హైలెట్ గా నిలిచింది. చావు మనిషికిచ్చే ఆఖరి మర్యాద.. నాలుగు పుస్తకాలు చదివి అంతా నాకే తెలుసు అనుకుంటున్నావు.. నీకు తెలియనిది చాలా ఉంది అని చెప్పే డైలాగా ప్రతి ఒక్కరి ఆలోచించేలా చేస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవిలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×