E-Paper
Advertisement

Allu Arjun: పుష్ప2 సినిమాకు ఏడాది.. మరిచిపోలేని ప్రయాణం అంటూ బన్నీ ట్వీట్!

Allu Arjun: పుష్ప2 సినిమాకు ఏడాది.. మరిచిపోలేని ప్రయాణం అంటూ బన్నీ ట్వీట్!
Advertisement

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ చిత్రం పుష్ప.  గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక పుష్ప 2 సినిమా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయ్యి నేటికి సరిగ్గా ఏడాది అవుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మీతో ప్రయాణం గౌరవంగా ఉంది..

ఈ సందర్భంగా అల్లు అర్జున్ సుకుమార్ తో కలిసి పుష్ప 2 షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. పుష్ప మా జీవితంలో మర్చిపోలేని ఐదు సంవత్సరాల ప్రయాణం అంటూ చెప్పుకువచ్చారు. ఈ సినిమాకు ప్రేక్షకులు అపారమైన ప్రేమ, మద్దతు ధైర్యాన్ని ఇచ్చి ఒక అద్భుతం చేశారని తెలిపారు. ఇలా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. ఇక ఈ ఐదు సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది సాంకేతిక నిపుణులు చిత్ర బృందం మా కెప్టెన్ సుకుమార్ గారితో కలిసి ఈ ప్రయాణం చేయటం ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో భాగమైనందుకు మీ ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ అల్లు అర్జున్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

పుష్ప 3 పై భారీ అంచనాలు…

Advertisement

గత ఐదు సంవత్సరాల క్రితం పుష్ప సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయని ఐదు సంవత్సరాలు పాటు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు ఈ సందర్భంగా అల్లు అర్జున్ తెలియజేశారు . అయితే పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో 1800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమాకు ఊహించని విధంగా ఆదరణ లభించిన నేపథ్యంలో పుష్ప3 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి ..ఇక ఈ సినిమా షూటింగ్ మరికాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ 2027లో ప్రారంభం కాబోతుందని చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు ఇటీవల వెల్లడించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా  సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ సైతం రామ్ చరణ్  తో మరో సినిమాకు కమిట్ అయ్యారు ఈ సినిమా 2026లో షూటింగ్ పనులు ప్రారంభం కానుంది.. ఈ విధంగా సుకుమార్ అల్లు అర్జున్ ఇద్దరి సినిమాలు పూర్తి అయిన తరువాత పుష్ప 3 పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

Also Read: Jatadhara OTT : ఓటీటీలోకి వచ్చిన సుధీర్ బాబు జటాధర..ఎక్కడ చూడొచ్చంటే!

Related News

హీరోల్లో అతడే బాగా ఫ్లర్ట్ చేసేవాడు.. జయప్రద కామెంట్స్ వైరల్ !

ప్రభాస్ హీరోయిన్ గ్లామర్ షో..కుర్రాళ్లకు పిచ్చెక్కించేలా!

రష్మికను ఇలా ఎప్పుడైనా చూశారా? ‘మైసా’ టీజర్ దిమ్మతిరిగేలా!

రూ.13 కోట్ల కారు.. మైథిలీపై ట్రోలింగ్.. కంగనా ఫైర్!

పిఠాపురంలో ఉపాసన రాంచరణ్ సామాజిక సేవ.. రూ. 2 కోట్ల వ్యయంతో!

విజయ్-అజిత్ కలిశారు.. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన కౌంటర్ మామూలుగా లేదుగా!

ది ప్యారడైజ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

అనుష్క ఎక్కడ? వివాహమా? కెరియర్?

Big Stories

Advertisement
×