NBK 111 Title Glimpse: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand)తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్న సమయంలో బాలకృష్ణకు(Balakrishna) సినిమా షూటింగ్లో భాగంగా ప్రమాదం జరగడంతో తన కాలికి సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా బాలకృష్ణకు సర్జరీ కావడంతో సినిమా షూటింగుకు చిన్న విరామం ఇచ్చారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని,అతి త్వరలోనే ఈయన తిరిగి షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఏ టైటిల్ పెట్టబోతున్నారు అనే అంశంపై ఇదివరకు సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి అయితే ఈ వార్తలు అన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర నిర్మాతలు ఈ సినిమా టైటిల్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ బ్యానర్ ఈ విషయం గురించి ఒక పోస్టర్ విడుదల చేస్తూ.. మ్యాడ్ నెస్ కు రేపు సాయంత్రం 6:40 కి పేరు పెట్టబోతున్నాము అంటూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో భాగంగా బాలకృష్ణ మొహంపై రక్తపు మరకలు కనిపిస్తూ ఉండడంతో సినిమా పట్ల ఆసక్తిని పెంచుతుంది.
ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల టైటిల్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. బాలకృష్ణ NBK 111 కోసం “గాడ్”, “దాదా” అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని వీటిలో చిత్ర నిర్మాతలు ఒకదానిని ఖరారు చేయబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ప్రకటించబోతున్నారనేది తెలియాలి అంటే మరో 24 గంటలు పాటు ఎదురు చూడాల్సిందేనని తెలుస్తుంది.
Tomorrow we put a ‘NAME’ to the madness.
And a ‘DATE’ to the arrival 🔥
6:40PM . Be Ready. #NBK111
GOD OF MASSES #NandamuriBalaKrishna @heromanoj1 @MsKajalAggarwal @megopichand @musicthaman @Venkataskilaru #ArvindKashyap @NavinNooli #AsPrakash #SaiMadhavBurra pic.twitter.com/qT6Fwb7eOF
— Vriddhi Cinemas (@vriddhicinemas) September 5, 2026
ఇక బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఇదివరకు వీర సింహారెడ్డి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఇలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వందకోట్ల కలెక్షన్లను రాబట్టిన నేపథ్యంలో తదుపరి వీరి కాంబినేషన్లో వస్తున్న NBK 111 సినిమా పట్ల కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాని ఈ ఏడాది చివరిన లేదా వచ్చే యేడాది మొదట్లో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. విడుదల తేదీ గురించి కూడా చిత్ర నిర్మాతలు రేపు క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు బాలకృష్ణ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.
Also Read: ఆదర్శ కుటుంబం విడుదలపై నాగ వంశీ క్లారిటీ.. ఒకేసారి ఇన్ని అప్డేట్స్ ఏంటీ చింటూ!