E-Paper
Advertisement

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారు
Advertisement

Hayden On Pakistan Team :  ఇంగ్లాండ్ గడ్డపై ( England) పాకిస్తాన్ ( Pakistan Team) అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. ఆడిన రెండు టెస్టుల్లో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్.. టెస్ట్ సిరీస్ కోల్పోయింది. ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ ను కొని తెచ్చుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఉన్నపలంగా ఏకంగా ఏడుగురు క్రికెటర్లను ఇంగ్లాండ్ నుంచి స్వదేశానికి రప్పించింది. ఇద్దరు కోచ్ లను కూడా అవమానించి మరి ఇంటికి పంపించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లను ఉద్దేశించి సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ టెస్ట్ పరిస్థితి ఎమర్జెన్సీ తలపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.

పాకిస్తాన్ జ‌ట్టులో అంద‌రూ క‌ట్టప్ప‌లే..అందుకే సంక‌నాకిపోతున్నారంటూ

ఇంగ్లాండ్ గడ్డపై వరుసగా ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్‌, మాజీ కోచ్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden ) ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ లో అద్భుతమైన టాలెంట్ ఉంది.. కానీ అందులో అందరూ కట్టప్పలే అని బాంబు పేల్చాడు. కట్టప్పలు ఉండడం వల్ల.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎదగడం లేదని విమర్శలు చేశారు మాథ్యూ హేడెన్. ఒక ఆటగాడు ఎదుగుతుంటే మరో ఆటగాడు.. కిందికి లాగడం ఎన్నో రోజుల నుంచి కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. తాను ఆ జట్టుకు కోచ్ గా ఉన్నప్పుడు కూడా ఇవే పరిస్థితిలో ఉన్నాయని వెల్లడించారు. అందుకే పాకిస్తాన్ వరుసగా ఓడిపోతూ వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాథ్యూ హేడెన్.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

అందరు క్రికెటర్లు కలిసి, మెలిసి సమిష్టిగా ఆడితే మంచి విజయాలు రావడం గ్యారంటీ అన్నారు మాథ్యూ హేడెన్. బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్, షాహిన్ అఫ్రిది, సల్మాన్ అలీ అఘా లాంటి ఎంతో మంది తోపులు ఉన్నారని.. వాళ్లు అద్భుతమైన టాలెంట్ కలిగి ఉన్నారని వెల్లడించారు. కానీ ఈ క్రికెటర్ల మధ్య తరచూ గొడవలు జరగడం… ఒకరంటే ఒకరికి పడకపోవడం వల్ల జట్టు చాలా దారుణంగా తయారవుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్ జట్టులో గ్రూప్ వార్ ఉండటం వల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు ఆస్ట్రేలియా మాజీ ఓపెన‌ర్‌, మాజీ కోచ్ మాథ్యూ హేడెన్ (Matthew Hayden ).

పాకిస్తాన్ బోర్డులో రాజ‌కీయ జోక్యం

Advertisement

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం ఎక్కువైందని మాథ్యూ హేడెన్ (Matthew Hayden ) వెల్లడించారు. మొహ్సిన్ నఖ్వీకి చైర్మన్ పదవి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న ప్లేయర్ల రాక తక్కువైందని షాకింగ్ ఆరోపణలు చేశారు. వారసత్వ ఆటగాళ్లకు ఛాన్సులు ఎక్కువగా ఇవ్వడం.. డబ్బులు ఇచ్చి మరి కొంత మంది పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి రావడం జరిగిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. దీని వల్ల కూడా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారయిందని వ్యాఖ్యానించారు.

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Tags

Related News

టీమిండియా తిక్క కుదరాలంటే, నఖ్వీకి ఐసీసీ చైర్మన్ పదవి ఇవ్వండి..!

వివాదంగా మారిన టీమిండియా జెర్సీ..కాషాయ రంగుపై విమ‌ర్శ‌లు !

పాకిస్తాన్ కోచ్ లుగా షోయ‌బ్ అక్త‌ర్‌, అఫ్రిదిల‌ను పెట్టుకోండి..!

ఈ టార్చ‌ర్ నా వ‌ల్ల కాదు..ఐపీఎల్ 2027 మ‌ధ్య‌లోనే త‌ప్పుకుంటా !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల నోట్లో మ‌ట్టి కొట్టిన BBL…టైం చూసి దెబ్బేశారు

రాసి పెట్టుకోండి.. ఎప్పుడు, ఎక్క‌డ మ్యాచ్ జ‌రిగినా మాదే విజ‌యం

క‌ళ్లు మూసుకుని బ్యాటింగ్ చేస్తావా ? అంటూ అభిషేక్ కు యూవీ పనిష్ మెంట్

Big Stories

Advertisement
×