AP DSC Scam: బిగ్ టీవీ తో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి dsc 2025 లో అక్రమాలు జరిగాయని చెప్తుందని అన్నారు. వాటి పై ఎంక్వయిరీ వేయమని చెప్తున్నా కానీ ప్రభుత్వం మాట వినలేదని అన్నారు. ఇప్పుడు ఎం అయ్యుందని ఫైర్ అయ్యారు. బిగ్ టీవీ కర్నూల్‌లో తప్పు జరిగిందని చూపిస్తే.. అప్పుడు అక్కడ DEO తో ఎంక్వయిరీ చేయిస్తారా అని అన్నారు.
అక్రమాలపై బిగ్ టీవీ కథనాలు ఇస్తే.. ప్రభుత్వానికి ఇవీ వ్యతిరేక కథనాలు అని బిగ్ టీవీ ఇంస్టాగ్రామ్‌ని లెటర్స్ రాసి బ్లాక్ చేంచారని అన్నారు. ఇవి ప్రభుత్వ వ్యతిరేక కథనాలు కాదు.. జరిగిన అక్రమాల పై బయటకు వచ్చిన గొంతు అని బిగ్ టీవీ అదే చేసిందని అన్నారు. ప్రజల్లో వచ్చిన తిరుబాటును చూసి ప్రభుత్వం భయపడుతుందన్నారు. లోకేష్ ఇప్పుడు దీనిని ఖండించాలన్నారు. దీని పై ఎంక్వయిరీ జరిపెంచాలరని ఏ తప్పు లేదని చెప్పాలన్నారు. నిజానిజాలని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి లేదంటే ఎంక్వయిరీ చేసిన DEO తో చెప్పించండి లోకేష్ అని అప్పల రాజు అన్నారు.
Dsc మీద సాధారణ ప్రజలు ఒక పోస్ట్ పెట్టిన దాన్ని బ్లాక్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ సమయాన్ని గుర్తుచేసేలా ఈ ప్రభుత్వం ఉందని ఫైర్ అయ్యారు. మా ప్రభుత్వం వచ్చాక అక్రమంగా ఉద్యోగం పొందిన అందరి పై ఎంక్వయిరీ జరుగుతుందని అన్నారు. విద్యా శాఖ మంత్రి బయటికొచ్చి ఇప్పటికికైనా వివరణ ఇవ్వాలని, లోకేష్ రాజినామ చేయాలనీ డిమాండ్ సిదీరి అప్పల రాజు డిమాండ్ చేసారు.
Also Read: బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !