E-Paper
Advertisement

Balakrishna: చరణ్ ట్విన్స్ కోసం బాలయ్య స్పెషల్ గిఫ్ట్స్.. మురిసిపోతున్న ఫ్యాన్స్!

Balakrishna: చరణ్ ట్విన్స్ కోసం బాలయ్య స్పెషల్ గిఫ్ట్స్.. మురిసిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

Balakrishna: నందమూరి హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటుడు బాలకృష్ణ (Balakrishna)ఇప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో నందమూరి అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేశారు. బాలకృష్ణ త్వరలోనే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారు. ఇటీవల కాలంలో నందమూరి మెగా హీరోల మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇలా ఈ అనుబంధం నేపథ్యంలోనే బాలకృష్ణ మెగా ట్విన్స్ కోసం అద్భుతమైన కానుకలు పంపించారని తెలుస్తోంది.

మెగా కవలలకు నందమూరి కానుకలు..

ఇటీవల రామ్ చరణ్(Ramcharan) ఉపాసన (Upasana)దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ మొదటి సంతానంలో భాగంగా ఆడబిడ్డ జన్మించారు. ఈ చిన్నారికి క్లీన్ కారా(Klinkaara) అని నామకరణం చేశారు.. ఇక రెండో సంతానంలో భాగంగా ఒక అమ్మాయి అలాగే ఒక అబ్బాయి జన్మించిన సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ కవల పిల్లలకు జన్మనివ్వడంతో సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది వీరికి అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ సైతం కవల పిల్లలకు ప్రత్యేకంగా కానుకలు పంపించారని సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.

పిల్లల కోసం ప్రత్యేకమైన కానుకలు..

Advertisement

సినీ ఇండస్ట్రీ సమాచారం ప్రకారం రామ్ చరణ్ కు కవలలు పుట్టారనే విషయాన్ని తెలుసుకున్న బాలకృష్ణ చరణ్ దంపతులకు అందమైన పూల బొకే పంపించారట. అలాగే ఒక వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో పాటు తిరుపతి ప్రసాదం, పిల్లలకు ఆడుకోవడానికి ఉపయోగపడే బొమ్మలు, గిఫ్ట్ హ్యాంపర్లు కూడా పంపించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇలా బాలకృష్ణ గిఫ్ట్స్ పంపించారంటూ వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త వైరల్ గా మారడంతో మెగా నందమూరి అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన హీరోలు..

Advertisement

ఇటీవల కాలంలో మెగా నందమూరి కుటుంబాల మధ్య చాలా స్నేహపూర్వ వాతావరణం ఉన్న తెలిసిందే. గతంలో మెగా వర్సెస్ నందమూరి అనే విధంగా వీరి మధ్య ఫ్యాన్ వార్ జరిగేది. కానీ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వెళ్ళిన తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య చాలా మంచి సఖ్యత ఉన్న నేపథ్యంలో మెగా నందమూరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కవల పిల్లలు జన్మించడంతో ఎన్టీఆర్, అల్లు అర్జున్ అల్లు శిరీష్ వంటి తదితరులు ఉపాసన రాంచరణ్ దంపతులకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇక మెగా అభిమానులు సైతం వారసుడు వచ్చాడంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఉపాసన తన ఇద్దరు కవల పిల్లలతో హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: Vishwak sen: ఆ సినిమా చూసి బాలయ్య, తారక్ అన్న క్లాస్ పీకారు: విశ్వక్ సేన్

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×