E-Paper
Advertisement

Spb: రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం,శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం

Spb: రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం,శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం
Advertisement

Spb: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమందికి ఎప్పటికీ కూడా ఉన్నతమైన చరిత్ర ఉంటుంది. వాళ్లు లేకపోయినా కూడా వాళ్ళ జ్ఞాపకాలు నిత్యం పదిలంగానే ఉంటాయి. దేవుడు కొంతమందిని కేవలం కొన్ని పనులు కోసమే భూమి మీదకు పంపిస్తారు. అలా భూమి మీదకి కేవలం పాడడానికి మాత్రమే పంపించారు అనిపిస్తుంది ఎస్పీ బాలసుబ్రమణ్యం పాటలు వింటే. ఎన్నో అద్భుతమైన పాటలను పాడారు ఎస్పిబి. పేరుకు తెలుగు సింగర్ అయినా కూడా ఎక్కువగా చెన్నైలోనే ఆయన జీవితాన్ని గడిపారు.

ఇప్పటికీ కూడా ఎన్నో సందర్భాలలో ఎస్పీ బాలసుబ్రమణ్యం సంగీతం చాలామందికి ఓదార్పుగా నిలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అదే సంగీతం ఉత్సాహాన్నిస్తుంది. అయితే ఎస్పీబీ జ్ఞాపకార్థం హైదరాబాద్ రవీంద్ర భారతి లోని అతని విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీనిని కొంతమంది తెలంగాణవాదులు అడ్డుకున్నారు. దీని మీద ఇప్పటికీ వివాదం మొదలైపోయింది.

విగ్రహ ఏర్పాటుపై వివాదం

Advertisement

రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుపై వివాదం మొదలైంది. 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తెలంగాణలో ఏపీ వారి విగ్రహాలు ఎందుకంటూ అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రముఖులు గద్దర్, అందెశ్రీ విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ డిమాండ్. ఈ క్రమంలో శుభలేఖ సుధాకర్, పృథ్వీరాజ్ మధ్య వాగ్వాదం.

నటుడు శుభలేఖ సుధాకర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కి స్వయాన భావ అవుతారు. ఎందుకంటే శైలజాన్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. అయితే ప్రస్తుతం పృథ్వీరాజ్ మరియు శుభలేఖ సుధాకర్కి మధ్య జరిగిన వాగ్వాదం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో పలుచోట్ల దర్శనమిస్తుంది.

కెమెరా ఎందుకు లాక్కున్నారు? 

Advertisement

ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ శుభలేఖ సుధాకర్ తో మాట్లాడుతూ కెమెరా ఎందుకు లాక్కుంటున్నారు.? అని అడగడం ప్రశ్నించారు. శుభలేఖ సుధాకర్ కూడా తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ పృథ్వీరాజ్ ఏమీ వినడం లేదు. ఆ పక్కనున్న వ్యక్తితో కూడా కొంచెం దురుసుగానే ప్రవర్తించారు పృథ్వీరాజ్. మొత్తానికి మీరు వితండవాదం చేస్తున్నారు అంటూ శుభలేఖ సుధాకర్ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు.

ఇకపోతే చాలామంది సోషల్ మీడియా వేదికగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కు సపోర్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ల కంటే కూడా తమిళ ప్రేక్షకులు గొప్పవాళ్లు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు విపరీతమైన గౌరవాన్ని ఇచ్చారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: Archana Kalpathi : 9 నుంచి 5 గంటల వరకు షూటింగ్ అంటే కుదరని పని, దీపికాకు అర్చన స్ట్రాంగ్ కౌంటర్ 

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×