E-Paper
Advertisement

Bandla Ganesh On Mowgli: మోగ్లీ సినిమాకు బండ్లన్న రివ్యూ.. అదే ఎక్కువైందంటూ!

Bandla Ganesh On Mowgli: మోగ్లీ సినిమాకు బండ్లన్న రివ్యూ.. అదే ఎక్కువైందంటూ!
Advertisement

Bandla Ganesh On Mowgli: కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మోగ్లీ(Mowgli). ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ప్రీమియర్లను ప్రసారం చేసిన సంగతి తెలిసిందే .ఇక ఈ సినిమా పట్ల ఎంతో మంది దర్శక నిర్మాతలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) సైతం ఈ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

రోషన్ కనకాల అనే నటుడు పుట్టాడు..

ఈ సందర్భంగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ.. వైల్డ్ బ్లాక్ బస్టర్ ట్యాగ్ చూశాక అనుకున్నాను.. పోస్టర్ మాటలే సినిమా వేరేలా ఉంటుందేమో అని కానీ సినిమా చూశాక అర్థమైంది పోస్టర్ ఇంకా సాఫ్ట్ గా ఉందని! ప్రత్యేకంగా చెప్పాలి మా సుమ రాజీవ్ కొడుకు అని స్టార్టింగ్ లో అనుకున్న కానీ స్క్రీన్ మీద చూసాక అర్థమైంది రోషన్ కనకాల అనే నటుడు పుట్టాడు.. ఇది అతని రెండో సినిమా. ఇక డైరెక్టర్ సందీప్ రాజ్ కథ మాటల్లో సింప్లిసిటీ సీన్స్ లో క్లారిటీ.. బండి సరోజ్ విలనిజం విలన్ కదా అని ఎక్కువ చేయలేదు. అదే ఎక్కువ అయింది.

థియేటర్ నుంచి నవ్వుతూ రావాలి..

Advertisement

ఇక హీరోయిన్ గురించి కూడా బండ్ల గణేష్ స్పందిస్తూ సాక్షి అమాయకత్వం సినిమాకు చక్కని బ్యాలెన్స్.. కాలభైరవ మ్యూజిక్ సీన్స్ కి అవసరమైన చోటే వచ్చి పని చేసింది. విశ్వప్రసాద్ గారి సినిమా టేస్ట్ అంటే ఇదే అని మళ్ళీ గుర్తు చేశారు. మొత్తానికి మోగ్లీ సినిమా చూశాక వైల్డ్ అనే మాటకి అర్థం అప్డేట్ అయ్యింది కంగ్రాట్స్ టీమ్ మోగ్లీ ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి మనం థియేటర్లో నవ్వుతూ బయటకు రావాలి అంటూ ఈయన సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

ఇకపోతే ఇటీవల కాలంలో బండ్ల గణేష్ పలు సినిమాల వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరవుతూ సందడి చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఈయన ఇతర హీరోలను టార్గెట్ చేస్తూ పరోక్షంగా మాట్లాడిన తీరు తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమవుతుంది. సోషల్ మీడియా వేదికగా లేదా పలు సినిమా వేడుకలలో ఈయన మాట్లాడే వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా ఉంటాయని చెప్పాలి. ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే నిర్మాతగా స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ సినిమాలను చేసిన బండ్ల గణేష్ ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈయన స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాను అంటూ గత కొంతకాలంగా చెబుతున్న ఇప్పటివరకు ఒక్క సినిమాని కూడా ఈయన ప్రకటించకపోవడం గమనార్హం.

Also Read: Sandeep Raj: రామ్ చరణ్ సినిమా చూసి థియేటర్ లోనే ఏడ్చిన డైరెక్టర్..అంత ఎమోషనలా..

Related News

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

Big Stories

Advertisement
×