E-Paper
Advertisement

Sandeep Raj: రామ్ చరణ్ సినిమా చూసి థియేటర్ లోనే ఏడ్చిన డైరెక్టర్..అంత ఎమోషనలా..

Sandeep Raj: రామ్ చరణ్ సినిమా చూసి థియేటర్ లోనే ఏడ్చిన డైరెక్టర్..అంత ఎమోషనలా..

Sandeep Raj: సందీప్ రాజ్ కలర్ ఫోటో సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకొని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. కలర్ ఫోటో సినిమాని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేసి సక్సెస్ తో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకోవడంతో ఈయనకు అనంతరం ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక సందీప్ రాజ్ దర్శకుడిగా కాకుండా ఇతర సినిమాలలో నటుడుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక తాజాగా ఈయన మోగ్లీ సినిమా(Mowgli) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఏడిపించిన ఓరయ్యో సాంగ్…

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ రాజ్ వరుస ఇంటర్వ్యూలకు హాజరై సందడి చేశారు. అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన రామ్ చరణ్ (Ramcharan)నటించిన రంగస్థలం (Rangasthalam)సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా విడుదలైన రోజు మాకు మొదటి షో టికెట్స్ ఉన్నాయి కానీ చాయ్ బిస్కెట్ టీం కోసం ప్రసాద్ ల్యాబ్ లో తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేకంగా షో వేశారని సందీప్ రాజ్ తెలిపారు. ఇలా అనుకోకుండా మంచి నిద్రలో మూడు గంటల సమయంలో థియేటర్ కి వెళ్లి సినిమా చూస్తున్నాము ఓకే సినిమా బాగుందనిపించింది కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఓరయ్యో అనే పాట రాగానే ఒక్కసారిగా ఏడ్చేసానని తెలిపారు.

బాహుబలి చనిపోయేటప్పుడు..

ఈ సాంగ్ రాగానే అంత నిద్ర మత్తులో ఉన్న తాను గుక్క పట్టి ఏడ్చానని సందీప్ రాజా తెలియజేశారు. ఇలా రంగస్థలం సినిమా తర్వాత బాహుబలి సినిమాలో బాహుబలి చనిపోయేటప్పుడు కూడా అంతే ఎమోషనల్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా సందీప్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్స్ విన్న అభిమానులు నిజంగానే రంగస్థలం సినిమాలో ఆ సాంగ్ అందరిని ఏడిపించిందని సందీప్ రాజ్ వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. రామ్ చరణ్ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఆది పినిశెట్టి చరణ్ అన్నయ్య పాత్రలో నటించిన మెప్పించారు.

విలన్ గా బండి సరోజ్..

తాజాగా సందీప్ రాజ్ రోషన్ కనకాలతో మోగ్లి సినిమా చేశారు. ఈ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ కనకాలకు ఇది రెండవ సినిమా కావటం విశేషం. ఇక సందీప్ రాజ్ కు దర్శకుడిగా కూడా ఇది రెండో సినిమా కావటం విశేషం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి నటించగా విలన్ పాత్రలో నటుడు బండి సరోజ్ నటించి ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Hyper Aadi: హైపర్ ఆది లవ్ స్టోరీ విన్నారా.. ఆ ఒక్క కారణంతోనే బ్రేకప్?

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×