E-Paper
Advertisement

CM Revanth vs Lionel Messi: రేవంత్‌, మెస్సీ ఫోటోల‌తో ఉప్పల్ లో లేజర్ షో..గూస్ బంప్స్ రావాల్సిందే

CM Revanth vs Lionel Messi: రేవంత్‌, మెస్సీ ఫోటోల‌తో ఉప్పల్ లో లేజర్ షో..గూస్ బంప్స్ రావాల్సిందే

CM Revanth vs Lionel Messi: హైదరాబాద్ మహానగరంలో లియోనెల్ మెస్సీ ( Lionel Messi ) అడుగుపెట్టారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న లియోనెల్ మెస్సీ, ఫలక్ నుమా ప్యాలస్ కు వెళ్లారు. ఇక మరికాసేపట్లోనే ఉప్పల్ స్టేడియానికి కూడా లియోనెల్ మెస్సీ రాబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Uppal International Cricket Stadium )  భారీ ఏర్పాట్లు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులను అలరించేందుకు అద్భుతమైన లేజర్ షో కూడా ఏర్పాటు చేసింది. ఈ లేజర్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) ఫోటోలతో పాటు లియోనెల్ మెస్సీ ( Messi ) ఫోటోలను వాడారు. లేజర్స్ వస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు దిగ్గజాల ఫోటోలు రావడం గమనార్హం. ఇది చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

Also Read: Messi Meets Revanth: నేడే రేవంత్ రెడ్డి వ‌ర్సెస్‌ మెస్సీ మ్యాచ్‌…షెడ్యూల్ ఇదే,ఒక్క‌ ఫోటోకు రూ.10 లక్షలు

మెస్సీ 10 నిమిషాల మ్యాచ్ ఆడతారు – శివసేనా రెడ్డి

మెస్సీ మ్యాచ్ నేప‌థ్యంలో బిగ్ టీవీతో తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్‌ శివసేనా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇది 90 నిమిషాల మ్యాచ్ కాదు, ఫ్రెండ్లీ మ్యాచ్ మాత్ర‌మే అన్నారు. మెస్సీ 10 నిమిషాల మ్యాచ్ ఆడతారన్నారు. క్రీడలను ప్రోత్సహించడానికి జరుగుతున్న మ్యాచ్ అని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో యువత డ్రగ్స్ కు బానిసైందని ఫైర్ అయ్యారు. యువతను క్రీడలవైపు మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఇదన్నారు. కలకత్తా వంటి ఘటనలు హైదరాబాద్ లో జరగవు అని తెలిపారు శివసేనారెడ్డి.

 

హైదరాబాద్‌లో లియో మెస్సీ: పూర్తి ఈవెంట్ షెడ్యూల్ అప్‌డేట్

7:50 PM IST – మ్యాచ్ కిక్-ఆఫ్
8:06 PM – గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైదానంలోకి ప్రవేశం
8:07 PM – లియోనెల్ మెస్సీ మైదానంలోకి ప్రవేశం
8:08 PM – రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ ప్రవేశం
8:11 PM – మెస్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంతిని డ్రిబుల్ చేస్తారు
8:13 PM – GOAT కప్‌ను నిర్ణయించడానికి పెనాల్టీ షూటౌట్ (జట్టుకు మూడు షాట్లు)
8:15 PM – రెండు జట్లతో గ్రూప్ ఫోటో
8:33 PM – మెస్సీ (గోల్ కీపర్‌గా నిర్వాహకుడు) ఉన్న ప్రత్యేక పెనాల్టీ షూటౌట్
8:38 PM – స్టేడియం చుట్టూ పరేడ్ వాక్, మెస్సీ అభిమానులకు ఊపుతూ
8:48 PM – వేదికపై అతిథులను పరిచయం చేశారు
8:51 PM – మెస్సీ నిర్వాహకులు మరియు జట్టు యజమానులను పలకరించారు; ఫోటో సెషన్
8:53 PM – లియోనెల్ మెస్సీ చే GOAT కప్ ప్రజెంటేషన్
8:54 PM – గౌరవనీయ ముఖ్యమంత్రి చే లియోనెల్ మెస్సీ నివాళులు
8:55 PM – లూయిస్ సువారెజ్ నివాళులు
8:56 PM – రోడ్రిగో డి పాల్ నివాళులు
8:57 PM – ఈవెంట్ సైన్-ఆఫ్
8:58 PM – గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ ప్ర‌సంగం
8:59 PM – రాహుల్ గాంధీ ప్ర‌సంగం
9:00 PM – స్టేడియం నుండి అన్ని ప్రముఖుల నిష్క్రమణ
9:10 PM – ఈవెంట్ ముగింపు

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×