E-Paper
Advertisement

OnePlus Pad Go 2: భారీ బ్యాటరీ, 8GB RAMతో పవర్‌ఫుల్ టాబ్లెట్.. వన్‌ప్లస్ Pad Go 2 లాంచ్‌కు రంగం సిద్ధం!

OnePlus Pad Go 2: భారీ బ్యాటరీ, 8GB RAMతో పవర్‌ఫుల్ టాబ్లెట్.. వన్‌ప్లస్ Pad Go 2 లాంచ్‌కు రంగం సిద్ధం!

OnePlus Pad Go 2: ప్రముఖ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి మరో కొత్త టాబ్లెట్ త్వరలో మార్కెట్లోకి రానుంది. OnePlus Pad Go 2 పేరుతో దీనిని డిసెంబర్ 17న అధికారికంగా ఆవిష్కరించనున్నారు. లాంచింగ్ తర్వాత.. దీని తొలి విక్రయాలు డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, యువ ప్రొఫెషనల్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ టాబ్లెట్‌ను డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. లాంచ్‌కు ముందే, దీనిలో ఉండే ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్ వంటి కీలక ఫీచర్లను వన్‌ప్లస్ ఇప్పటికే వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే..

నాలుగేళ్ల స్మూత్ పెర్ఫార్మెన్స్:

రాబోయే OnePlus Pad Go 2లో MediaTek Dimensity 7300 Ultra ఆక్టా-కోర్ చిప్‌సెట్ ఉంటుందని వన్‌ప్లస్ అధికారికంగా ధృవీకరించింది. 4nm మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్‌పై తయారైన ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరు, తక్కువ పవర్ వినియోగాన్ని అందిస్తుంది. అలాగే, ఈ టాబ్లెట్ 4 ఏళ్ల స్మూత్ పెర్ఫార్మెన్స్ అందించగలదని కంపెనీ తెలిపింది. గ్రీక్ బెన్చ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ప్యాడ్ 8GB RAMతో వస్తూ, తాజా Android 16 ఆధారిత OxygenOS 16పై పని చేస్తుందని సమాచారం.

Also Read: కెమెరా నుంచి పెర్ఫార్మెన్స్ వరకూ భారీ అప్‌గ్రేడ్స్.. Realme 16 Pro+ 5G స్పెసిఫికేషన్లు లీక్!

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్:

OnePlus Pad Go 2లో 10,050mAh భారీ బ్యాటరీ ఉండనుంది. ఇది 33W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ టాబ్లెట్‌తో 15 గంటల వీడియో ప్లేబ్యాక్, 53 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, అలాగే 60 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ పొందవచ్చు. అదనంగా ఇది రివర్స్ కేబుల్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

స్టైలస్ సపోర్ట్‌తో:

ఈ టాబ్లెట్‌తో పాటు OnePlus Pad Go సిరీస్‌కు అనుకూలమైన తొలి స్టైలస్ Stylo ను కూడా వన్‌ప్లస్ పరిచయం చేయనుంది. నోట్స్ తీసుకోవడం, ప్రొడక్టివిటీ టాస్క్స్ నిర్వహించడం, క్రియేటివ్ పనులు చేయడం వంటి అవసరాలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది. ఇప్పటికే కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ స్టైలస్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ అందిస్తుంది.

Also Read: రూ.1,44,000 పైగా డిస్కౌంట్.. సోనీ బ్రావియా 75 అంగుళాల 4K TV ఇప్పుడు అదిరిపోయే ధరలో!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×