E-Paper
Advertisement

బండ్లన్న ఇంట మొదలైన పెళ్లి సందడి.. మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం!

బండ్లన్న ఇంట మొదలైన పెళ్లి సందడి.. మెగా ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం!
Advertisement

Bandla Ganesh:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్ గా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న బండ్ల గణేష్ ఇంట్లో ఇప్పుడు పెళ్లి సందడి మొదలైంది. తన కూతురు జననీ బండ్ల వివాహ వేడుకకు అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తన సతీమణితో కలిసి ఇండస్ట్రీ పెద్దలను , పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కలుస్తూ వివాహ పత్రికను అందజేసి స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఇక ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు వెడ్డింగ్ కార్డ్స్ అందజేసిన బండ్లన్న ఇప్పుడు తన కుటుంబంతో కలిసి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని సగౌరవంగా కలిశారు.

చిరంజీవి దంపతులను కుటుంబ సమేతంగా కలిసిన బండ్ల గణేష్..

మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదెలను స్వయంగా కలిసిన బండ్ల గణేష్.. తన కూతురి వివాహానికి రావాలి అని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్నారు బండ్ల గణేష్. అంతేకాదు ఈ సందర్భంగా అన్నయ్యను కలిసిన నేపథ్యంలో ఒక భావోద్వేగ పోస్టు కూడా షేర్ చేశారు. “నేను సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అన్నయ్య.. ఎంతోమందికి మార్గదర్శి, మా బిగ్ బాస్ పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులను కుటుంబ సమేతంగా కలసి.. నా కూతురు జననీ వివాహానికి ఆహ్వానించి, వారి అమూల్యమైన ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆనందంగా ,ఆత్మీయంగా అనిపించింది” అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జనని వివాహానికి పిలుపు..

Advertisement

నిజానికి బండ్ల గణేష్ కి చిరంజీవిపై విపరీతమైన అభిమానం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎన్నోసార్లు బండ్ల గణేష్ చిరంజీవిపై ఉన్న తన ప్రేమను వ్యక్తపరిచారు. గత ఏడాది జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా చిరంజీవి కోసం ప్రత్యేకంగా సింహాసనాన్ని తయారు చేయించి మరీ తన ఇంటి దీపావళి వేడుకల్లో ప్రత్యేక హోదా కల్పించారు. తన సినీ జీవితానికి చిరంజీవి స్ఫూర్తి అని , ఆయన ఆశీస్సులు తనకు గొప్ప బలం అని ఎన్నోసార్లు చెప్పిన బండ్ల గణేష్.. ఇప్పుడు ఏకంగా తన కూతురి పెళ్లి కోసం స్వయంగా కుటుంబ సమేతంగా వెళ్లి ఆహ్వానించడం అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది. ఇక మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా జననికి ముందుగానే వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఆగస్టు 16వ తేదీన సినీ ,రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జనని వివాహం జరగబోతోంది.

also read:HBD Priyanka Chopra: ప్రియాంక చోప్రా వారణాసి కంటే ముందు నటించిన తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

బండ్ల గణేష్ కాబోయే అల్లుడి బ్యాక్ గ్రౌండ్..

Advertisement

బండ్ల గణేష్ కాబోయే అల్లుడి బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే.. చిలుకూరి సూర్య తేజ తో ఈమె ఏడడుగులు వేయబోతోంది. సూర్య కుటుంబానికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి. ఈయన కుటుంబం కోట్లాది రూపాయల ఆస్తులు కలిగి ఉన్న బలమైన వ్యాపారంగ పేరు సొంతం చేసుకుంది. దీంతో సూర్య ప్రొఫెషన్ ఏంటి? రియల్ ఎస్టేట్ బిజినెస్ లోనే ఉన్నారా? లేక మరి ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా ?ఆయన విద్యార్హతలు ఏంటి ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

https://twitter.com/i/status/2078382553808171331

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×