E-Paper
Advertisement

బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

బడ్జెట్‌లో స్మార్ట్‌వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే
Advertisement

pTron Force X10e Review : ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అనేది మన చేతికి ఒక స్టైలిష్ లుక్ ఇవ్వడమే కాకుండా, మన హెల్త్ పార్టనర్‌గా కూడా మారిపోయింది. అయితే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్స్ ఉన్న బెస్ట్ వాచ్ కోసం వెతికే వారికి పిట్రాన్ (pTron) నుండి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అమెజాన్‌లో బెస్ట్ సెల్లింగ్ బడ్జెట్ గ్యాడ్జెట్‌గా దూసుకుపోతున్న సరికొత్త pTron Force X10e స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం మార్కెట్లో ట్రెండ్ సెట్ చేస్తోంది. కేవలం రూ.1,799 ధరకు లభిస్తున్న ఈ వాచ్ పూర్తి ఫీచర్స్..

pTron Force X10e ఫీచర్లు:

ఈ స్మార్ట్‌వాచ్‌లో అందరినీ ఆకట్టుకునే మొదటి విషయం దీని పెద్ద స్క్రీన్. ఇందులో.. 1.7 ఇంచుల ఫుల్ టచ్ కలర్ డిస్‌ప్లేను అందించారు. దీని బ్రైట్‌నెస్ , కలర్స్ చాలా రిచ్‌గా ఉంటాయి, అందువల్ల అవుట్‌డోర్‌లో ఎండలో ఉన్నప్పుడు కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. దీని కర్వ్డ్ గ్లాస్ డిజైన్ వాచ్‌కి చాలా ప్రీమియం అండ్ స్లిమ్ లుక్‌ను ఇస్తుంది. చేతికి పెట్టుకుంటే.. చాలా లైట్ వెయిట్‌గా, కంఫర్టబుల్‌గా ఉంటుంది.

Advertisement

హెల్త్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ ప్రైస్ రేంజ్‌లో pTron Force X10e అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇందులో 24/7 రియల్-టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్ ఉంది, ఇది మీ గుండె వేగాన్ని నిరంతరం ట్రాక్ చేస్తుంది. దీనితో పాటు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవడానికి SpO2 సెన్సార్, మీ నిద్ర నాణ్యతను అంచనా వేసే స్లీప్ ట్రాకర్ , రోజు మొత్తం ఎన్ని స్టెప్స్ నడిచారో లెక్కించే పెడోమీటర్ కూడా ఉన్నాయి. ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం ఇందులో మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇచ్చారు.

Also Read: ఒక్క రోజు ఛార్జ్ చేస్తే.. 20 రోజుల బ్యాటరీ! ఈ వాచ్ ఫీచర్స్ చూశారా ?

Advertisement

బ్యాటరీ లైఫ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నార్మల్ యూసేజ్‌లో.. ఏకంగా 10 నుంచి 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. దీనివల్ల ప్రతి రోజూ ఛార్జర్ వెతుక్కునే తలనొప్పి తప్పుతుంది. స్మార్ట్ నోటిఫికేషన్స్ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌కి వచ్చే కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్ఎంఎస్‌లను డైరెక్ట్‌గా వాచ్ స్క్రీన్ పైనే.. చూసుకోవచ్చు. అలాగే కెమెరా కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి.

ధర విషయానికి వస్తే.. pTron Force X10e స్మార్ట్‌వాచ్ ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్స్, అమెజాన్‌లో కేవలం రూ.1,799 ఆఫర్ ధరకే లభిస్తోంది. రూ. 2,000 లోపు ఒక బ్రాండెడ్, పెద్ద డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌వాచ్ కొనాలనుకునే కాలేజీ స్టూడెంట్స్,బడ్జెట్ లవర్స్‌కి ఇది ఒక వాల్యూ ఫర్ మనీ డీల్ అని చెప్పొచ్చు.

Related News

ఇంట్లో Wi-Fi డెడ్ జోన్స్‌కు సింపుల్ సొల్యూషన్.. పాత ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఇలా చేయండి!

వాషింగ్ మెషీన్‌ను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఈ విషయం తెలుసా?

AIతో పెరుగుతున్న సైబర్ మోసాలు.. మీ డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోండిలా!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

కొత్త 5G ఫోన్‌తో ఫిలిప్స్ రీ-ఎంట్రీ.. సెప్టెంబర్ 2న ఏం లాంచ్ చేయనుందంటే?

బ్యాటరీ ఎక్కువకాలం మన్నాలంటే 80-20 రూల్ పాటించాల్సిందేనా?

ఒకప్పుడు ఇవే స్టేటస్ సింబల్.. 90లలో ఫేమస్ అయిన 5 ఫోన్లు ఇవే!

మ్యాక్‌లో సిస్టమ్ స్టోరేజ్ పెరిగిపోయిందా? ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా ఖాళీ చేసి స్పీడ్ పెంచండి!

Big Stories

Advertisement
×