RC17 Update: సుక్కు చరణ్ లు రంగ స్థలం తర్వాత RC17 వర్కింగ్ టైటిల్ తో మరో సినిమా చేస్తామని అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.ఇక పెద్ది థియేటర్ లోకి వచ్చేయడంతో ఇప్పుడీ కాంబో సినిమా చేయడానికి రెడీ అయిపోతుందట.అవును ..ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వచ్చే సెప్టెంబర్ లోనే ముహూర్తం పెట్టుకోబోతుందని సమాచారం.
అంతే కాదండోయ్.. అసలెక్కడా ఆగేదేలే అంటూ నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేసేందుకు ఇప్పటి నుండే ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.రంగస్థలం లాంటి కల్ట్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ కావడంతో, అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు నార్మల్ ఆడియన్స్‌లోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి.
కియరా అద్వానీ హీరోయిన్ గా,నయనతార కీరోల్?
ఈ భారీ కాంబోను టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరు, మిగతా కాస్టింగ్ ఏంటి అనే విషయాలను ప్రస్తుతానికి బయటపెట్టకపోయినా,కియరా అద్వానీ హీరోయిన్ గా,నయనతార కీరోల్ చేస్తుందన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
also read:‘3 ఇడియట్స్’ వెనుక ఇంత కథ ఉందా? ఆమిర్ ఖాన్ గుట్టు విప్పిన సోనమ్ వాంగ్‌చుక్ పాత వీడియో!
దేవి శ్రీ ప్రసాద్ vs శశ్వత్ సచ్‌దేవ్
ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం ఫిలిం సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ నడుస్తోంది.జనరల్‌గా సుకుమార్ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆల్బమ్స్ అన్నీ చార్ట్‌బస్టర్లే. కానీ, ఇప్పుడు లేటెస్ట్‌గా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది.చరణ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తూ, నిఖిల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ఇండియా హౌస్’ చిత్రానికి సంగీతం అందిస్తున్న ధురంధర్ శశ్వత్ సచ్‌దేవ్ పేరు ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం గట్టిగా వినిపిస్తోంది. ఒకవైపు దేవి శ్రీ ప్రసాద్ మార్క్ మ్యూజిక్, మరోవైపు శశ్వత్ సచ్‌దేవ్ సరికొత్త సౌండింగ్.. ఈ రెండింటిలో సుకుమార్ చివరికి ఎవరిని ఫైనలైజ్ చేస్తారనేది మెగా ఫ్యాన్స్‌లో పెద్ద సస్పెన్స్‌గా మారింది.
అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే
ఈ మ్యూజిక్ డైరెక్టర్ రూమర్లపై క్లారిటీ రావాలంటే మాత్రం రామ్ చరణ్-సుకుమార్ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. ఏదేమైనా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే టాలీవుడ్‌లో సరికొత్త వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక రంగస్థలం విషయానికి వస్తే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా లో రాంచరణ్ తేజకి జంటగా సమంత నటించగా ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రలను పోషించారు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించగా దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.ఇక ఏప్రిల్ 2017 నుండి షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా మార్చి 30, 2018న విడుదలయి బాక్సాఫీస్ వద్ద
210 కోట్లు వసూలు చేసిన సంగతి తెల్సిందే.
also read:గౌరీ స్ప్రాట్‌తో పెళ్లే కారణమా? ఆమిర్ ఖాన్ ని టార్గెట్ చేసిన బిష్ణోయ్ గ్యాంగ్?