Bandla Ganesh: బండ్ల గణేష్ ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని దేవుడిగా కొలిచే బండ్ల గణేష్ (Bandla Ganesh)ని మెగా ఫ్యాన్స్ ఎంతగానో అభిమానిస్తుంటారు. ఎవరు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా, పవన్ కళ్యాణ్‌పై మాత్రం ఏనాడూ బండ్ల గణేష్ మాట జారలేదు. పవన్ కళ్యాణ్ ఎంతో నమ్మిన వారు కూడా ఆయనని చివరి నిమిషంలో మోసం చేశారు.. కానీ బండ్ల గణేష్ మాత్రం ‘ఈశ్వరా, పవనేశ్వరా’ అంటూ తననొక దేవుడిగా ఆరాధిస్తూ, తనొక భక్తుడిగా మారిపోతుంటాడు. అలాంటి బండ్ల గణేష్‌ని పిలిచి పదవి ఇస్తాం, పవన్ కళ్యాణ్‌ని తిట్టాలి అంటే తిడతాడా? అవును, ఇదే విషయంపై ఓ పార్టీ ఆయనను ప్రలోభ పెట్టడానికి ట్రై చేసిందట. కానీ బండ్ల వారికి ఇచ్చిపడేశారట. అందుకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read- Actor Pawan: లైవ్‌లో నటికి ప్రపోజ్ చేసిన నటుడు.. షాక్‌లో ఫ్యాన్స్! జరిగింది ఇదే!
‘‘ఏడు కొండలవాడి సాక్షిగా చెబుతున్నా.. ఒక రోజు ఒకాయన, ఒక ఛానల్‌లో కూర్చుని ఫోన్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగాడు. షాద్ నగర్ ఫామ్‌లో ఉన్నానని చెప్పా. ఎంత సేపటిలో వస్తావ్? అని అడిగాడు. షాద్ నగర్ నుంచి బయలు దేరి ఒక గంట, గంటన్నరలో ఆఫీస్‌కు వెళ్లా. అక్కడికి వెళ్లగానే ‘నీకు ఎమ్మెల్సీ ఇస్తాం అన్నారు’. వాళ్లు అలా అనగానే తీసుకుంటానని చెప్పా. అయితే ఓ కండీషన్ అని అన్నారు. ఏంటా కండీషన్ అని అడిగా. ‘ప్రతి రోజూ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్‌ని తిట్టాలి’ అని అన్నారు. ‘నా బాడీ బూడిద అయినా కానీ, ఆ బూడిద కూడా పవన్ కళ్యాణ్‌ను తిట్టదు’ అని చెప్పి వచ్చేశా’’ అని.. బండ్ల గణేష్ చెబుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆయన ఏడు కొండలవాడిని సాక్షిగా చెప్పకపోయినా, నార్మల్‌గా చెప్పినా అంతా నమ్మేస్తారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ అంటే బండ్లకు అంత భక్తి కాబట్టి. అయితే, ఆయనకు ఈ ఆఫర్ ఇచ్చిందెవరనే విషయం మాత్రం బండ్ల గణేష్ చెప్పలేదు.
Also Read- Actress Revathi: ఆకతాయి అసభ్యకరంగా తాకినందుకు నటి రేవతి ఏం చేసిందంటే?
అయితే ఆ పార్టీ ఏదై ఉంటుందా? అని అంతా సెర్చ్ చేస్తున్నారు. బండ్ల గణేష్‌కి ఈ ఆఫర్ ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? అంటూ నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్స్ చేస్తుండటం విశేషం. నిజమే, సినిమా ఇండస్ట్రీలో బండ్ల వంటి వారికి అలాంటి పదవులే ఇచ్చి, పవన్ కళ్యాణ్‌ని ఎలా తిట్టించారో తెలియంది కాదు. ఇంకా ఏ ప్రభుత్వమో అని ప్రశ్నలెందుకు అని మెగా ఫ్యాన్స్ వారికి సమాధానాలు ఇస్తున్నారు. ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) జైలు నుంచి విడుదలైన సందర్భంలో తిరుమలేశుని చెంతకు కాలి నడకన వస్తానని బండ్ల మొక్కుకున్నారట. ఆ మొక్కును ప్రస్తుతం తీర్చుకుంటున్నారు. తన ఇంటి నుంచి శ్రీవారి చెంతకు సంకల్ప యాత్ర చేపట్టిన బండ్ల గణేష్, 16 రోజులుగా ఈ యాత్రను కొనసాగిస్తూనే ఉన్నారు.
Also Read- Ram Pothineni: ఆర్కా మీడియా బ్యానర్‌లో రామ్ సినిమా ఆగిపోవడానికి కారణమిదేనా?