Ram Pothineni: తన కెరీర్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) చాలా బ్యాడ్ ఫేజ్‌ని ఫేస్ చేస్తున్నారు. ఆయన ఏ సినిమా చేస్తున్నా అది బాక్సాఫీస్ వద్ద ఫట్ మంటోంది. ఇటీవల వచ్చిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ (Andhra King Taluka) చిత్రం కాస్త పరవాలేదు అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ, రాంగ్ టైమింగ్‌లో విడుదలకావడంతో, కలెక్షన్ల పరంగా మళ్లీ పరాజయాన్నే చవిచూడాల్సి వచ్చింది. ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో అని పేరున్న రామ్‌కు ఈ పరిస్థితి ఏంటి? అంటూ ఆయన అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా వరుస పరాజయాలతో ఆయనతో సినిమా చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వచ్చినా, చాలా తక్కువ బడ్జెట్‌లో, చాలా తక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. అంతే, ఏం చేయాలో పాలుపోక, రామ్ అన్నింటిని రిజిక్ట్ చేస్తున్నాడనేలా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇలానే ఆయన ఓ ప్రముఖ బ్యానర్ మూవీని వద్దనుకున్నట్లుగా తాజాగా టాలీవుడ్‌లో వార్తలు మొదలయ్యాయి.
Also Read- Film Awards: రిలీజ్ కానీ సినిమాకు 3 అవార్డులు.. గవర్నమెంట్‌పై ట్రోలింగ్!
ఇండస్ట్రీలో ఎప్పుడూ సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది.. లేదంటే పవన్ కళ్యాణ్‌లా కనీసం క్రేజ్ అయినా ఉండాలి. అప్పుడు మాత్రమే ఎన్ని ప్లాప్స్ వచ్చినా, క్రేజ్ కాపాడేస్తుంది. అదే రామ్‌కి మిస్సవుతుంది. మరి ఆయన ఎన్నుకునే సబ్జెక్ట్స్‌లో లోపం ఉంటుందో, లేదంటే ప్రేక్షకులు ఆయనను చూసే కోణంలో మార్పు ఉందో తెలియదు కానీ, చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఆయనకు నిరాశనే మిగుల్చుతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత హిట్ కోసం రామ్ (Hero Ram) ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కూడా అందని ద్రాక్షగానే మారుతోంది. ఈ క్రమంలో ఆయన తదుపరి చేయాల్సిన ప్రముఖ బ్యానర్ కూడా బడ్జెట్ పరంగా ఆంక్షలు పెట్టిందట. అంతే, మీ ప్రాజెక్ట్‌లో చేయనని రామ్ డైరెక్ట్‌గా చెప్పేశాడనేలా టాక్ మొదలైంది. ఆ బ్యానర్ ఏదో కాదు.. ‘బాహుబలి’ (Bahubali) సిరీస్ చిత్రాలతో సంచలన విజయాలను నమోదు చేసిన ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ (Arka Media Works Banner).
Also Read- Actor Pawan: లైవ్‌లో నటికి ప్రపోజ్ చేసిన నటుడు.. షాక్‌లో ఫ్యాన్స్! జరిగింది ఇదే!
‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు ముందు రామ్ ఆర్కా మీడియాలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారట. ఆ సినిమా ఈ ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా, అనూహ్యంగా ఆగిపోయిందనేలా టాక్ మొదలైంది. ఎందుకలా జరిగిందని ఆరా తీస్తే.. రామ్ పరాజయాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణ సంస్థ, బడ్జెట్‌ని, రామ్ రెమ్యునరేషన్‌ని భారీగా కోసేసిందట. అందుకే, అవమానంగా భావించిన రామ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు మొదలయ్యాయి. మరి ఈ వార్తలపై మూవీ యూనిట్ ఏమైనా వివరణ ఇస్తుందేమో చూడాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చేయబోయే తదుపరి ప్రాజెక్ట్ ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. మంచి సబ్జెక్ట్‌తో, మంచి హిట్ కొట్టాలని ఆయన అభిమానులు మాత్రం ఎంతగానో కోరుకుంటున్నారు.
Also Read- Actress Revathi: ఆకతాయి అసభ్యకరంగా తాకినందుకు నటి రేవతి ఏం చేసిందంటే?