E-Paper
Advertisement

Actor Pawan: లైవ్‌లో నటికి ప్రపోజ్ చేసిన నటుడు.. షాక్‌లో ఫ్యాన్స్! జరిగింది ఇదే!

Actor Pawan: లైవ్‌లో నటికి ప్రపోజ్ చేసిన నటుడు.. షాక్‌లో ఫ్యాన్స్! జరిగింది ఇదే!
Advertisement

Actor Pawan: పవన్ అనగానే మన టాలీవుడ్ నటుడని అనుకుంటారేమో.. ఎందుకంటే, ఈ మధ్యకాలంలో పవన్ పేరుతో చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంటరయ్యారు. కానీ ఇది టాలీవుడ్ పవన్‌కు సంబంధించిన న్యూస్ కాదు. భోజ్‌పురి ఇండస్ట్రీలో పవన్‌ సింగ్‌ (Pawan Singh)‌కు సంబంధించిన వార్త. సింగర్, యాక్టర్ (Bhojpuri Film Actor And Singer) అయిన పవన్ సింగ్ అంటే భోజ్‌పురిలో ఒక సెన్సేషన్. ఆయన పాటలు ఎంత వైరల్ అవుతాయో, ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు కూడా అంతే హాట్ టాపిక్‌గా మారుతుంటాయని పేరు. తాజాగా ఒక లైవ్ షోలో పవన్ సింగ్ చేసిన పనికి అక్కడి ఆడియన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. అంత షాకయ్యే పని పవన్ సింగ్ ఏం చేసి ఉంటారని అనుకుంటున్నారా? అసలు ఏం జరిగిందంటే..

Also Read- Upcoming Movies : ‘ది రాజా సాబ్’ నుంచి రాజ్ బి శెట్టి యాక్షన్ థ్రిల్లర్ వరకు.. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీస్

మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నా..

Advertisement

లైవ్ షో‌లో స్టేజ్‌పై తనతో కలిసి ఉన్న నటికి ఏకంగా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు పవన్ సింగ్. షో మధ్యలో పవన్ సింగ్ సదరు నటితో సరదాగా ముచ్చటిస్తూ.. ‘నీకు పెళ్లయిందా?’ అని అడిగారు. దానికి ఆమె.. ‘ఇంకా కాలేదు, మంచి అబ్బాయి కోసం వెతుకుతున్నాను’ అని బదులిచ్చింది. అంతే, పవన్ సింగ్ తనదైన స్టైల్లో సరదా సంభాషణ స్టార్ట్ చేశాడు. ‘‘ఇంకెక్కడో వెతకడం ఎందుకు.. నీ కళ్ల ముందే ఒకడు కనిపిస్తున్నాడుగా, చూసుకో.. నాకేం తక్కువ? కాస్త నల్లగా ఉంటానేమో కానీ, సంస్కారం ఉంది, చేతినిండా సంపాదిస్తున్నాను. నేను అందగాడిని కాకపోవచ్చు కానీ, మంచివాడిని. మీ ముందున్న నన్నే ఎన్నుకోండి’’ అంటూ సరదాగా ప్రపోజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అంతే, షో ఏం జరుగుతుందో అర్థం కాక, చూస్తున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక ఆ నటి సంగతి అయితే సరే సరి..

Also Read- Actress Revathi: ఆకతాయి అసభ్యకరంగా తాకినందుకు నటి రేవతి ఏం చేసిందంటే?

అమ్మాయిలు కూడా అంతేనమ్మా..

Advertisement

ఈ హఠాత్ పరిణామానికి ఆ నటి మొదట ఆశ్చర్యపోయినా.. వెంటనే తేరుకుని నవ్వుతూ చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. ‘‘ఈ కాలం అబ్బాయిలు ఉదయం ‘హాయ్’ చెప్పి సాయంత్రం ‘బై’ చెబుతున్నారు’’ అని ఆమె కౌంటర్ ఇవ్వగా.. పవన్ సింగ్ కూడా ఏమాత్రం తగ్గకుండా ‘అమ్మాయిలు కూడా అంతేనమ్మా!’ అంటూ పంచ్‌ పేల్చారు. ఈ సరదా సంభాషణ ఇప్పుడు భోజ్‌పురి నెటిజన్లకు ఫుల్ మీల్స్‌లా మారింది. ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌‌లలో తెగ వైరల్ అవుతోంది. దీనికి ‘పవన్ సింగ్ ఎనర్జీ వేరే లెవల్’ అని కొందరు కామెంట్ చేస్తుంటే, ‘ఆయన వైవాహిక జీవితం గురించి తెలిసిన వాళ్లకు ఇదంతా ఒక పెద్ద జోక్’ అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఏది ఏమైనా, తన పర్ఫార్మెన్స్‌తో సోషల్ మీడియాలో మరోసారి పవన్ సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారన్నది మాత్రం వాస్తవం.

Also Read- MSVPG OTT: ఓటీటీలోను మన శంకర వరప్రసాద్ గారు రికార్డ్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్?

Related News

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

Big Stories

Advertisement
×