E-Paper
Advertisement

WPL 2026 Final: వ‌రుస‌గా 4వ సారి ఫైన‌ల్స్ కు ఢిల్లీ..ఫైన‌ల్స్ లో ఆర్సీబీని చిత్తు చేస్తుందా ?

WPL 2026 Final: వ‌రుస‌గా 4వ సారి ఫైన‌ల్స్ కు ఢిల్లీ..ఫైన‌ల్స్ లో ఆర్సీబీని చిత్తు చేస్తుందా ?
Advertisement

WPL 2026 Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026  ) తుది దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల ( Royal Challengers Bengaluru Women vs Delhi Capitals Women, Final ) జట్ల మధ్య జరగనుంది. మంగళవారం రోజున గుజరాత్ జట్టును చిత్తుగా ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు, నేరుగా ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. ఇక ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 5వ తేదీన బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఇప్పటికే మూడుసార్లు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయింది. ఇది నాలుగోసారి. ఈ నాలుగోసారైనా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్స్ లో విజయం సాధించి ఛాంపియన్ అవుతుందా ? లేక మరోసారి బెంగళూరు విజయం సాధిస్తుందా ? అనేది చూడాలి.

Also Read: Danish Kaneria: టీమిండియా అంటే నిద్ర‌లో కూడా ఉలిక్కిప‌డుతున్నారు..ఫైన‌ల్స్ ఆడాల్సి వ‌స్తే పారిపోతారా ?

నాలుగో సారి ఫైనల్స్ కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఈ టోర్నమెంట్ లో మంగళవారం రోజున ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్ల మధ్య ఫైట్ జరిగింది. ఇందులో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. గుజరాత్ ఉమెన్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే 20 ఓవర్లు వాడిన గుజరాత్, 7 వికెట్లు నష్టపోయి 168 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇరగదీసింది. 15.4 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, మూడు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. దీంతో 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ విజయంతో వరుసగా నాలుగో సారి ఫైనల్స్ కు చేరింది ఢిల్లీ క్యాపిటల్స్.

2023 నుంచి ఇప్పటివరకు ఢిల్లీనే తోపు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 నుంచి ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు చేరుకుంది. ఇలా మొత్తం నాలుగు సార్లు ఫైనల్ కు చేరుకుoది. 2023లో ఫైనల్కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ సమయంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఇటు 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ కు  చేరుకోగా బెంగళూరు ( Royal Challengers Bengaluru Women ) విజయం సాధించింది. ఇక 2025లో ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు బెంగళూరు తో మరోసారి ఫైనల్స్ లో తలపడా నుండి ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ వడోదర ( BCA Stadium) వేదికగా జరగనుంది.

Advertisement

Also Read: Kevin Pietersen-Mohsin Naqvi: పాకిస్తాన్ కు సిగ్గుందా ? మ‌రీ..ఫైన‌ల్స్ లో టీమిండియాతో ఆడాల్సి వ‌స్తే, ఏం పీకుతారు? రెచ్చిపోయిన‌ పీట‌ర్స‌న్

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×