E-Paper
Advertisement

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు.. రిక్వెస్టుల మాత్రమే!

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు.. రిక్వెస్టుల మాత్రమే!
Advertisement

Bandla Ganesh: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) హీరోగా దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కె – ర్యాంప్ (K-Ramp)ఈ సినిమాలో మమిత బైజు (Mamitha Baiju )హీరోయిన్ గా నటించి సందడి చేశారు. యూత్ ఫుల్ ఎంటర్టైర్నర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తాజాగా చిత్ర బృందం బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఏపీకి సంబంధించిన మంత్రులు కూడా పాల్గొని సందడి చేశారు అలాగే మరొక నిర్మాత బండ్ల గణేష్ కూడా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు.

నిర్మాతకు సలహా ఇచ్చిన బండ్ల గణేష్..

ఇక బండ్ల గణేష్ ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్లారు అంటే ఆయన మాట్లాడే మాట తీరు కారణంగా వార్తల్లో నిలుస్తారనే సంగతి తెలిసిందే. ఇక ఈ రాంపేజ్ బ్లాక్ బాస్టర్ వేడుకలో భాగంగా ఈయన కే రాంప్ సినిమా నిర్మాత రాజేష్ దండు(Rajesh Dandu) గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గురించి నెగిటివ్ గా కొంతమంది రివ్యూ ఇవ్వడంతో వారిపై నిర్మాత రాజేష్ దండు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తన మాటల వెనుక ఆంతర్యం ఏంటో కూడా ఈయన వివరించారు.. ఇలా సినిమా వేడుకలో భాగంగా నిర్మాత రాజేష్ దండు వార్నింగులు ఇవ్వడంతో ఈ విషయం గురించి తాజాగా బండ్ల గణేష్ మాట్లాడారు.

ఇండస్ట్రీలో వార్నింగులు పనికిరావు..

Advertisement

కే ర్యాంప్.. ఇది నిజంగానే కే ర్యాంప్.. మిత్రుడు తమ్ముడు రాజేష్ కు అభినందనలు తెలియజేస్తున్నాను. వరుస హిట్టు సినిమాలను అందుకుంటున్నందుకు అభినందనలు .. మరిన్ని హిట్ సినిమాలను అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూనే మరోవైపు నువ్వు మాత్రం స్టేజిల మీద ఇకపై వార్నింగులు ఇవ్వద్దు అంటూ నిర్మాత రాజేష్ కు బండ్ల గణేష్ సలహా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో వార్నింగులు ఇస్తే అసలు వర్కౌట్ అవ్వవు.. ఇక్కడ రిక్వెస్ట్ లు మాత్రమే వర్కౌట్ అవుతాయని బండ్ల గణేష్ తెలిపారు.

రాజకీయాలలో మాత్రమే వర్కౌట్ అవుతాయి..

Advertisement

వార్నింగులు కేవలం రాజకీయాలలో మాత్రమే వర్కౌట్ అవుతాయి తప్ప సినిమాలకు కాదు అంటూ బండ్ల గణేష్ రాజేష్ దండు చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనంతరం ఈయన సినిమా గురించి అలాగే హీరో కిరణ్ అబ్బవరం గురించి కూడా మాట్లాడుతూ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో షీల్డ్ లను కూడా ప్రధానం చేశారు. కిరణ్ అబ్బవరం ఇటీవల కాలంలో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ ఈయన కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నారు.

Also Read: The Girl Friend censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. రన్ టైం ఎంతంటే?

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×