The Girl Friend: నేషనల్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అక్టోబర్ 21వ తేదీ ఈమె నటించిన హర్రర్ చిత్రం థామా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 7వ తేదీ మరొక సినిమా ద్వారా రష్మిక ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో రష్మిక, దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend). ఈ సినిమా నవంబర్ 7వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు అలాగే సెన్సార్ (Censor)కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా సెన్సార్ సభ్యులు వీక్షించిన అనంతరం ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేశారు అలాగే ఈ సినిమాని 2గంటల18 నిమిషాల రన్ టైమ్ లాక్ చేశారు. ఈ సినిమాలో ఎమోషన్స్ అలాగే కంటెంట్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాయని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేశారు ఇక సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా చూసిన అనంతరం సెన్సార్ సభ్యులు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో సుదీర్ఘమైన చర్చలు కూడా జరిపారని అనంతరం ఆయన దర్శకత్వ ప్రతిభ ఫై ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది.
ఈ సినిమాలో రావు రమేష్, రోహిణి, అను ఇమ్మాన్యుయెల్ వంటి తదితరులు కీలక పత్రలలో నటిస్తున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడు నిర్మిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహీబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను ఓపెన్ చేయడమే కాకుండా రష్మిక ఖాతాలో మరొక హిట్ రాబోతోందని తెలుస్తోంది.
డబుల్ రెమ్యూనరేషన్..
ఇలా ఎన్నో అంచనాల నడుమ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రష్మిక అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక కాలేజీ అమ్మాయి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విషయంలో రష్మిక కూడా ఎంతో ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కథ వినగానే ఈమె రెమ్యూనరేషన్ తో పని లేకుండా ఈ సినిమాలో నటించారు అంటేనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థం అవుతుంది. రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాల్లో నటించిన నేపథ్యంలో సినిమా హిట్ అయిన తర్వాత రెండింతలు రెమ్యూనరేషన్ ఇస్తామని నిర్మాత ధీరజ్ కూడా హామీ ఇచ్చారు. మరి నవంబర్ 7వ తేదీ రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: Anasuya: నా వయస్సు తగ్గుతోంది.. బంగారం ధర పెరుగుతుంది..అనసూయ హాట్ కామెంట్స్!