E-Paper
Advertisement

Bandla Ganesh:  కాసేపట్లో మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్.. బండ్ల ట్వీట్ వైరల్!

Bandla Ganesh:  కాసేపట్లో మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్.. బండ్ల ట్వీట్ వైరల్!
Advertisement

Bandla Ganesh: సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇలా సంక్రాంతి సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు(MSVPG) సినిమా కూడా ఒకటి. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాబోతుండగా 11వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. మరి కాసేపట్లో ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే థియేటర్ల వద్ద మెగా అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమా మరి కాసేపట్లో ప్రసారం కాబోతోంది.

తెలుగు సినిమా గర్వకారణం..

ఈ నేపథ్యంలోనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh)సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించిన పోస్టర్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ..”మన తెలుగు సినిమా గర్వకారణం, ఆల్‌టైమ్ ఫేవరెట్, ఏకైక మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ గారు అలియాస్ మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ యాక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. దానికి మరింత ఆకర్షణగావిక్టరీ వెంకటేష్ గారి చమత్కారమైన హాస్యం మరియు అనిల్ రావిపూడి పండగ ..అల్ ది బెస్ట్” అంటూ బండ్ల గణేష్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ తెలియచేస్తూ షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

చిరంజీవికి వీరాభిమాని..

Advertisement

ఇక బండ్ల గణేష్ మెగా అభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. చిరంజీవి గారికి బండ్ల గణేష్ ఎంత పెద్ద పీట వేస్తారో ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ఆయన ఇంట్లో నిర్వహించిన వేడుక సమయంలోనే స్పష్టమైనది. చిరంజీవిని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఎప్పటికప్పుడు మెగాస్టార్ గురించి ప్రశంసలు పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అంటూ ఈయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

సంక్రాంతి బ్లాక్ బాస్టర్

Advertisement

ఇక మెగా అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి చివరిగా 2003 వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆతృతగా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి. దీంతో ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో మరి కాసేపట్లో తెలియనుంది.

Also Read; Nari Nari Naduma Murari Trailer: ఎంటర్టైనింగ్ గా శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ట్రైలర్..

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×