E-Paper
Advertisement

OnePlus Nord 6: భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. వన్‌ప్లస్ నార్డ్ 6తో పాటు టర్బో 6 సిరీస్ విడుదల!

OnePlus Nord 6: భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. వన్‌ప్లస్ నార్డ్ 6తో పాటు టర్బో 6 సిరీస్ విడుదల!
Advertisement

OnePlus Nord 6: ప్రముఖ మొబైల్స్ ఉత్పత్తిదారు వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ టర్బో 6, టర్బో 6V అనే రెండు మోడల్స్ చైనా మార్కెట్‌లో విడుదలైంది. మిడ్‌రేంజ్ విభాగంలో భారీ బ్యాటరీతో పాటు అత్యాధునిక ఏఐ ఫీచర్లను కలిగి ఉన్న ఈ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్‌లో 9,000mAh భారీ బ్యాటరీ హైలైట్‌గా నిలుస్తోంది. ఇప్పటివరకు ప్రజాదరణ పొందిన ఫోన్లలో కనిపించిన బ్యాటరీలతో పోలిస్తే ఇది చాలా పెద్దదే. అంతేకాదు.. కొత్త తరం క్వాల్‌కామ్ ప్రాసెసర్లు, మెరుగైన డ్యూరబిలిటీ, డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

కొన్ని రిపోర్ట్స్ ప్రకారం.. Oneplus ఈ Turbo సిరీస్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో నార్డ్ బ్రాండ్ కింద తీసుకురానుందని సమాచారం. అంటే.. చైనాలో లాంచ్ అయిన టర్బో 6 మోడల్స్, గ్లోబల్‌గా వన్‌ప్లస్ నార్డ్ 6, నార్డ్ సీఈ 6 పేర్లతో రీబ్రాండెడ్ వెర్షన్‌లుగా రావచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Also Read: రూ.21,999 ధరకే IP69 రేటింగ్ స్మార్ట్‌ఫోన్.. ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో A6 ప్రో 5G వచ్చేసింది!

GSMArena నివేదిక ప్రకారం.. Oneplus Nord 6 ఇప్పటికే పలు గ్లోబల్ సర్టిఫికేషన్లను పొందింది. మలేషియా, యూఏఈ వంటి దేశాల్లో అనుమతులు పొందడం చూస్తే.. విడుదలకు సమయం ఆసన్నమైందని నిపుణులు భావిస్తున్నారు. 2025 జులై నెలలో Nord 5 విడుదల కాగా.. ఈసారి Nord 6 సిరీస్ 2026 ఆరంభంలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, దీని గురించి కంపెనీ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement

ఇక ధరల విషయానికి వస్తే.. చైనాలో Turbo 6 సుమారు రూ.27,000 ధర ఉండగా, Turbo 6V ధర దాదాపు రూ.21,000గా ఉంది. అదే విధంగా భారతదేశంలో Nord 6 ధర రూ.28,000 నుంచి రూ.32,000 మధ్య, Nord CE 6 ధర రూ.22,000 నుంచి రూ.25,000 మధ్యలో ఉండవచ్చని లీక్స్ సూచిస్తున్నాయి.

అలాగే ఈ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్, 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ ఉండే అవకాశముంది. 9,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉన్న ఈ ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్లు ఉండనున్నట్లు టెక్ వర్గాల అంచనా. మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో ఇది నిజంగా కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవొచ్చని కూడా చెబుతున్నారు.

ఇకపోతే.. డ్యూరబిలిటీ పరంగా కూడా ఈ ఫోన్లు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో దుమ్ము, నీరు, అధిక ప్రెషర్ వాటర్ జెట్స్‌ను కూడా తట్టుకునే స్థాయిలో డిజైన్ చేశారు. అలాగే కెమెరా విభాగంలో 50MP Sony LYT-600 మెయిన్ సెన్సర్(OISతో), ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఆక్సిజన్ OSతో ఈ ఫోన్లు లాంచ్ కావచ్చని అంచనా.

Also Read: ఇంతకంటే మంచి అవకాశం మళ్లీరాదు బ్రో.. అమెజాన్‌లో ఒప్పో K13 టర్బోపై మతిపోయే డిస్కౌంట్!

 

 

 

 

 

 

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×