BigTV English
Advertisement

Prabhas -Rashmika : ప్రభాస్ సినిమాలో రష్మిక.. చచ్చిపోతానన్న నెటిజెన్.. ఏమైందంటే?

Prabhas -Rashmika : ప్రభాస్ సినిమాలో రష్మిక.. చచ్చిపోతానన్న నెటిజెన్.. ఏమైందంటే?

Prabhas -Rashmika: సినీ నటి రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రస్తుతం వరుస సినిమాలలో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈమె బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తే బిజీగా ఉన్నారు. ఇక రష్మిక, ప్రభాస్ (Prabhas)కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు కూడా ఎంతో ఆరాటపడుతున్నారు. అంతేకాకుండా సందీప్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాలో రష్మిక హీరోయిన్ అనే వార్తలు కూడా ఒకానొక సమయంలో బయటకు వచ్చాయి. ఇలా రష్మిక ప్రభాస్ కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కూడా ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.


హైప్ తోనే నేను చచ్చిపోతాను..

ఇక ఇదే విషయం గురించి తాజాగా రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend)సినిమా నవంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రష్మిక ఇంస్టాగ్రామ్ ద్వారా అలాగే ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని ఈమెను ప్రశ్నిస్తూ మీరు ప్రభాస్ తో కలిసి సినిమాలో నటిస్తారా? అలా జరిగితే మీ ఇద్దరి కాంబినేషన్లో సినిమాకు వచ్చే హైప్ తోనే నేను చచ్చిపోతానని నా బాడీని తీసుకెళ్లండి అంటూ ఫన్నీగా ప్రశ్నించారు.

ప్రభాస్ తో సినిమా ఎంతో ప్రత్యేకం..

ఇలా అభిమాని అడిగిన ప్రశ్న పట్ల రష్మిక స్పందిస్తూ ప్రభాస్ తో సినిమా చేయాలని నేను కూడా చాలా ఆశపడుతున్నాను. ప్రభాస్ ఈ మెసేజ్ చూస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ మేము ఇద్దరం కలిసి ఒక సినిమాలో నటిస్తే అది చాలా ప్రత్యేకంగా మారబోతుంది అంటూ రష్మిక రిప్లై ఇవ్వడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్పై ఇటు ప్రభాస్ అభిమానులు, రష్మిక అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి రష్మిక చేసిన ఈ పోస్ట్ నిజంగానే ప్రభాస్ దృష్టికి వెళ్తుందా? ఆయన తదుపరి సినిమాలలో రష్మికకు అవకాశం ఇస్తారా? అనేది తెలియాల్సి ఉంది.


మరో నాలుగు సినిమాలలో బిజీగా రష్మిక..

ఇక రష్మిక ప్రస్తుతం మరో నాలుగు సినిమాలలో నటించబోతున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ నాలుగు సినిమాల షూటింగ్ పనులు కూడా జరుగుతున్నాయని రష్మిక తెలియజేశారు. ఇక ది గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే.. ఈ సినిమా లవ్ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ప్రముఖ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ధీరజ్ మొగిలినేని ,విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వ్యవహరించగా, గీత ఆర్ట్స్ సమర్పణలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో రష్మికకు జోడిగా దీక్షిత్ శెట్టి నటించారు.

Also Read: Bandla Ganesh: కిరణ్ అబ్బవరం రియల్ హీరో.. చిరంజీవితో పోల్చిన బండ్ల గణేష్!

Related News

Spirit : వాట్ ఏ సడన్ సప్రైజ్, ప్రభాస్ స్పిరిట్ పూజ రేపే

Ram Pothineni : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం

Bandla Ganesh: ఒక్క సినిమా హిట్టు కొడితే, అలా బిహేవ్ చేస్తారు, బండ్ల కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

Bandla Ganesh: కిరణ్ అబ్బవరం రియల్ హీరో.. చిరంజీవితో పోల్చిన బండ్ల గణేష్!

Rajesh Danda: అలా చేయకుండా ఉండాల్సింది, ప్రొడ్యూసర్ రిలైజేషన్

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు.. రిక్వెస్టుల మాత్రమే!

The Girl Friend censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. రన్ టైం ఎంతంటే?

Big Stories

×