BigTV English
Advertisement

Rajesh Danda: అలా చేయకుండా ఉండాల్సింది, ప్రొడ్యూసర్ రిలైజేషన్

Rajesh Danda: అలా చేయకుండా ఉండాల్సింది, ప్రొడ్యూసర్ రిలైజేషన్

Rajesh Danda: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా నిలబడడం అనేది అంత సులువైన పని కాదు. దర్శకుడు యొక్క ఆలోచనను నమ్మి డబ్బులు పెట్టడం అనేది రిస్క్ తో కూడుకున్న ప్రాసెస్. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అవుతాయి అని చెప్పలేము. కొన్ని సినిమాలు వర్కౌట్ అవుతాయి మరికొన్ని డిజాస్టర్ అవుతాయి. రీసెంట్ టైమ్స్ లో రాజేష్ దండా ప్రొడ్యూసర్ గా అద్భుతమైన సినిమాలు నిర్మిస్తున్నారు. ఈయన యంగ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు.


చాలామంది యంగ్ ప్రొడ్యూసర్స్ కి కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. యంగ్ ప్రొడ్యూసర్స్ కాబట్టి వాళ్లకు అనిపించిన విషయాల్ని నిర్మొహమాటంగా వేదికల పైన చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పడం వలన కొన్నిసార్లు ఎన్నో తప్పిదాలు ఎదురవుతుంటాయి. అనుకోకుండా కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. రాజేష్ దండ రీసెంట్గా నిర్మించిన సినిమా K-Ramp. ఈ సినిమాకి కొద్దిపాటి నెగిటివ్ టాక్స్ వచ్చినా కూడా మౌత్ టాక్ ద్వారా మంచి సక్సెస్ సాధించుకుంది.

అలా చేయకుండా ఉండాల్సింది 

ఈ సినిమా మంచి సక్సెస్ సాధించటంతో సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ఈవెంట్ కూడా నిర్వహించారు. సక్సెస్ మీట్ ఈవెంట్ జరుగుతున్న తరుణంలోనే ఫోన్ చెక్ చేసుకున్నాడు నిర్మాత రాజేష్. అయితే అప్పుడు అతనికి తన సినిమా గురించి వేరే సినిమాని కంపేర్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ కొన్ని కనిపించాయి.


దానితో రాజేష్ దండ చాలా ఓపెన్ గా ఒక వ్యక్తి పేరు బయటకు తీసి ఆ వెబ్సైట్ వాడు ఇంకా నా సినిమా గురించి నెగిటివ్ రాస్తున్నాడు. ఇలాంటి నా కొడుకుల్ని ఉరి తీయాలి అనే రేంజ్ లో మాట్లాడేశారు. అయితే నిర్మాత రాజేష్ బాగోద్వేగం కరెక్ట్ అయినా సరే తను వాడిన పదజాలం మాత్రం చాలా మందికి ఆలోచించేలా చేసింది.

అయితే ఇదే విషయాన్ని నిర్మాత రాజేష్ కి కూడా చాలామంది చెప్పారట. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని స్టేజ్ పైన ఒప్పుకున్నాడు రాజేష్. ప్రస్తుతం ఈ స్పీచ్ కూడా వైరల్ గా మారుతుంది.

బండ్ల అదే చెప్పారు 

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరైన బండ్ల గణేష్ కూడా అదే విషయాన్ని రాజేష్ తో చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు. ఏదైనా రిక్వెస్ట్ చేసుకోవాలి అని చెప్పారు. మొత్తానికి ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నిర్మాతలలో రాజేష్ కూడా ఒకరు. కొంచెం మాట్లాడే విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో స్థిరపడవచ్చు.

Also Read: Vijay Sethupathi : అడ్జస్ట్ అవ్వండి ఆ పని కూడా చేస్తా, విజయ్ సేతుపతి ఏంటి అంత మాట అనేసాడు?

Related News

Spirit : వాట్ ఏ సడన్ సప్రైజ్, ప్రభాస్ స్పిరిట్ పూజ రేపే

Ram Pothineni : రామ్ చరణ్ దారిలో రామ్ పోతినేని, ఇది శుభ పరిణామం

Prabhas -Rashmika : ప్రభాస్ సినిమాలో రష్మిక.. చచ్చిపోతానన్న నెటిజెన్.. ఏమైందంటే?

Bandla Ganesh: ఒక్క సినిమా హిట్టు కొడితే, అలా బిహేవ్ చేస్తారు, బండ్ల కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి?

Bandla Ganesh: కిరణ్ అబ్బవరం రియల్ హీరో.. చిరంజీవితో పోల్చిన బండ్ల గణేష్!

Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్ లు వర్కౌట్ అవ్వవు.. రిక్వెస్టుల మాత్రమే!

The Girl Friend censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్.. రన్ టైం ఎంతంటే?

Big Stories

×