E-Paper
Advertisement

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?
Advertisement

PAN Aadhaar Link: పాన్-ఆధార్ లింకింగ్ ను ఆదాయపు పన్ను శాఖ తప్పనిసరి చేసింది. మీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకున్నారా? లేదంటే వీలైనంత త్వరగా అలా చేయాలి. డిసెంబర్ 31, 2025 నాటికి పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలి. లేదంటే ఆ పాన్ కార్డులు జనవరి 1, 2026 నుండి డీయాక్టివేట్ అవుతాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఆధార్ కార్డు తరహాలో పాన్ కార్డు కూడా ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రం. పాన్ కార్డు లేకపోతే ఆర్థిక లావాదేవీలు చేయలేరు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్, కళాశాలలు, పాఠశాలలు సహా అనేక ప్రభుత్వ సంబంధిత పనులకు పాన్ కార్డు అవసరం.

ఆర్థిక లావాదేవీలకు కీలకమైన పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అలా చేయకపోతే పాన్ కార్డు త్వరలో డీయాక్టివేట్ కావచ్చని తెలిపింది. ఆన్ లైన్ లో పాన్ కార్డును ఆధార్ తో సులభంగా లింక్ చేసుకోవచ్చు.

పాన్ కార్డు ప్రయోజనాలు

Advertisement

పాన్ ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు. ఇది పన్నులు దాఖలు చేయడానికి మాత్రమే కాకుండా, బ్యాంకు అకౌంట్ తెరవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, ఆస్తి కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. పాన్ కార్డు డీయాక్టివేట్ అయితే అనేక ఆర్థిక లావాదేవీలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి.

పాన్-ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి?

  • ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో ఆధార్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ 10 అంకెల పాన్ కార్డు నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • స్క్రీన్ పై వచ్చే సూచనల ప్రకారం రూ. 1,000 రుసుము చెల్లించండి.
  • మీ రిక్వెస్ట్ సబ్‌మిట్ అయిన తర్వాత, ప్రాసెస్ చేస్తారు.

పాన్-ఆధార్ లింక్ ఎలా చెక్ చేసుకోవాలి?

  • వెబ్‌సైట్‌లో లింక్ ఆధార్ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
  • ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in పై క్లిక్ చేయండి.
  • హోం పేజీలో లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంటుంది.
  • ఇందులో పాన్, ఆధార్ నంబర్లను నమోదు చేయండి.
  • వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పై క్లిక్ చేయండి.

Also Read: Supreme Court: భారత్ లో పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

SMS ద్వారా ఎలా చెక్ చేసుకోవాలి

Advertisement

UIDPAN <ఆధార్ నంబర్> <PAN నంబర్> అని టైప్ చేసి 567678 లేదా 56161 కు SMS పంపండి. పాన్-ఆధార్ లింక్ స్టేటస్ రిప్లై వస్తుంది.

Tags

Related News

మెర్సిడెస్ షాప్‌లో భారీగా అగ్నిప్రమాదం.. 8 లగ్జరీ కార్లు దహనం, జైపూర్‌లో ఘటన

పలాము జిల్లాలో తీవ్ర విషాదం.. కోయల్ నదిలో మునిగి ముగ్గురు మైనర్లతో సహా 5 గురు మృతి

ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్ వ్యవహారం.. మంత్రి ప్రకటనతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

అక్టోబర్ 15 నుంచి మారనున్న యూపీఐ రూల్స్.. రూ. 2,000 లోపు చెల్లింపులకు బిగ్ రిలీఫ్!

పెళ్లయిన రెండువారాలకే.. నవ వధువు ప్రియుడితో కలసి, షాకైన భర్త-కుటుంబసభ్యులు

పెట్రోల్ బంక్‌లో షాకింగ్ ఘటన.. ట్రాక్టర్‌తో యువకుడ్ని చంపే ప్రయత్నం, సీసీటీవీ సాక్షిగా

వందేమాతరం వివాదం.. కేంద్రం మార్గదర్శకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

ఒడిశాలో ఘోరం.. రోడ్డుపై అడ్డగించి జంటపై దాడి.. కలకలం రేపుతున్న వీడియో!

Big Stories

Advertisement
×