E-Paper
Advertisement

Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి సీరియస్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?

Barabar Premista: యాటిట్యూడ్ స్టార్ చేసిన పనికి సీరియస్ అవుతున్న నెటిజన్లు.. ఎందుకంటే?
Advertisement

Barabar Premista: బుల్లితెర మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహంచారు. అయితే ఆ ఈవెంట్ లో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేసిన పనికి ప్రక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. అసలు ఏం జరిగింది అంతే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా యాటిట్యూడ్ స్టార్ ఒక పాటను పాడాడు.. అది కాస్త ఇప్పడు తెగ వైరల్ అవుతోంది. అసలు అందులో వైరల్ విషయం ఏం ఉందంటే.. తెలుగులో బూతులు కలిసిన కొన్ని పదాలను ఆ పాటలో వాడారు. అంతే కాకుండా.. ఆ బూతులు ఉన్న పాటను యాటిట్యూడ్ స్టారే స్వయంగా పాడటంతో దీనిపై ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుంది. అసలు అలాంటి పాటలు పాడటం ఏంటి, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు.. అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. మరి కొందరు అయితే రాబోయే తరాలు బూతులు వాడుక భాషగా మారతాయని కామెంట్లు పెడుతున్నారు.

Read also-Thriller Movie OTT : మొగుడు మిస్సింగ్ తో భార్య చేసే సాహసం… అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు…క్లైమాక్స్ కేక

Advertisement

ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ కంటే యాటిట్యూడ్ స్టార్ గానే ప్రేక్షకులకు సుపరిజితం.. ఏవేవే పనులు చేస్తూ ఎప్పుడూ ట్రోలింగ్ కు గురయ్యే చంద్రహాస్ మరోసారి ట్రోలింగ్ కు గురవుతన్నారు. ఇంత బహిరంగంగా బూతులు పెట్టడంపై సాహిత్య కారులు కూడా ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అయితే దీని గురించి మూవీ టీం మాత్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు. మరి ఈ ఘటన గురించి మూవీ టీం పట్టించుకుంటుందో లేదో చూడాలి మిరి. కొంత మంది ఇదంతా పబ్లిక్ స్టంట్గా భావిస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసమే ఇదంతా చేస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read also-The Paradise: రూ.200 కోట్లు దాటేసిన నాని ‘ద ప్యారడైజ్’ బడ్జెట్.. అంత ఉందా మరి?

Advertisement

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ హీరోగా సంపత్ రుద్ర తెరకెక్కించిన చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ దర్శకుడు జయంత్ సి పరాన్జీ, జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ, అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ తదితరులు.

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×