Gold Chains Stolen: పసిడి పేరు ఎత్తితే చాలు సామాన్యులు ఆమడ దూరంగా ఉంటున్నారు. మార్కెట్లో ధరలు ఆ రేంజ్‌లో ఉన్నాయి. ధరలు తగ్గుతున్నట్లు కనిపించినా సామాన్యుడిని ఇంకా అందని పరిస్థితి. కేవలం పెట్టుబడులు పెట్టినవారికి రిలీఫ్. బంగారం ధరలు ఆశాకాన్ని తాకడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహారాష్ట్రలో అజిత్ పవార్ అంత్యక్రియల సందర్భంగా 30 లక్షల రూపాయల విలువ చేసే బంగారం గొలుసులు చోరీ కావడం కలకలం రేపింది. ఇప్పుడు బాధితులు పోలీసుస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.
అజిత్ పవార్ అంత్యక్రియల్లో దొంగలు చేతివాటం
ఒకప్పుడు బంగారం కోసం దొంగతనాలు జరిగేవి. ఎందుకంటే అప్పట్లో ధరలు ఆ రేంజ్‌లో ఉండేది. ఆనాడు డబ్బు విలువతో పోల్చితే బంగారం ధర ఎక్కువని భావించేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ప్రస్తుతం బంగారం ధర మార్కెట్లో అమాంతంగా పెరిగింది. అదే క్రమంలో దొంగతనాలు జోరందుకున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు, చివరకు అంత్యక్రియల్లో కూడా బంగారం చోరీ చేస్తున్నారు దొంగలు.
బంగారం ధరలు పెరగడంతో దొంగలు అటువైపు ఫోకస్ చేశారు. ఇటీవల విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. ఆయన చివరి చూపు చూసేందుకు వేలాది మంది అభిమానులు బారామతి వెళ్లారు. కార్యకర్తల నుంచి ఓ స్థాయి రాజకీయ నేతలు హాజరయ్యారు. దాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు దొంగలు.
30 లక్షల బంగారం చోరీ.. పోలీసుస్టేషన్లకు బాధితులు
అభిమానుల్లో కలిసిపోయి తమ చేతివాటం ప్రదర్శించారు. అజిత్ పవార్ అంత్యక్రియల కోసం బారామతికి వెళ్లిన 15 మంది బంగారం చైన్లు మిస్ అయ్యాయి. దీంతో సదరు బాధితులు లబోదిబోమంటూ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు 30 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసుల అంచనా.
బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఘటన రోజు, మరుసటి రోజు దాదాపు 8 వేల మంది పోలీసులు బారామతికి వచ్చారు. అంతమంది పోలీసులు విధుల్లో ఉన్నా దొంగలు చేతివాటం ప్రదర్శించారు. దాదాపు 15 మంది నుండి బంగారు గొలుసులు చోరీ చేశారు.
ALSO READ: విషాదం.. అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి పడి బాలిక మృతి
ఆ సమయంలో కొంతమంది అనుమానిత దొంగలనురెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. భారీ బందోబస్తు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున దొంగతనం జరగడం భద్రత గురించి పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరికొందర్ని బారామతి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు సామాన్యులు తస్మాత్ జాగ్రత్త.