Barabar Premista: బుల్లి తెర మెగాస్టార్ సుధాకర్ తనయుడు హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించారు. అర్జున్ మహీ (“ఇష్టంగా” ఫేమ్) ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు జయంత్ సి పరాన్జీ, జేడీ చక్రవర్తి, ఆది సాయి కుమార్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ .. ‘జయంత్ తీసిన ‘తీన్ మార్’, ‘శంకర్ దాదా’ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆది అన్న అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆది అన్నే నాకు స్పూర్తి. జేడీ చక్రవర్తి అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉన్నారు. నాకోసం ఇంత మంది రావడం ఆనందంగా ఉంది. నన్ను కని, పెంచిన నా తండ్రి ప్రభాకర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మేఘన తెలుగు చిత్రసీమలో పెద్ద హీరోయిన్ అవుతుంది. ధృవన్ చాలా టాలెంటెడ్. ఈ చిత్రం కోసం అద్భుతమైన పాటల్ని అందించాడు. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన చిన్ని గారు, చందు గారు, వెంకీ గారికి థాంక్స్. ఈ ప్రాజెక్ట్ నాకు రావడానికి కారణమైన కెమెరామెన్ శేఖర్ అన్నకి థాంక్స్. ఈ సినిమా ఒక్క సెకన్ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. లెక్కపెట్టలేనన్ని, ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రారంభం నుంచి చివరి వరకు అలా కూర్చుని చూస్తుండిపోతారు. సంపత్ ఈ మూవీని గొప్పగా తీశారు. నన్ను బాగా చూపించారు. ఫిబ్రవరి 6న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.’ అని అన్నారు.
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘ప్రభాకర్ అన్నతో నేను ‘నెక్ట్స్ నువ్వే’ మూవీని చేశాను. అప్పుడు నాకు చంద్రహాస్ గురించి ఎక్కువగా చెబుతుండేవారు. మంచి హీరో అవుతాడని అప్పుడే అనుకున్నాను. చంద్రహాస్ పడే కష్టాన్ని చూస్తున్నాను. ఎంతో నిజాయితీగా కష్టపడుతున్నాడు.’ అని అన్నారు. జయంత్ సి పరాన్జీ మాట్లాడుతూ .. ‘‘బరాబర్ ప్రేమిస్తా’ అనే టైటిల్‌లోనే యాటిట్యూడ్, కాన్ఫిడెన్స్, పొగరు ఉంది. మన చంద్రహాస్ ఆటిట్యూడ్ స్టార్. చంద్రహాస్ మంచి సింగర్ కూడా. మేఘనలోనూ మంచి ఎనర్జీ, ఆటిట్యూడ్ ఉంది. సంపత్ ఈ మూవీని గొప్పగా చిత్రీకరించాడు. ధృవన్ ఇచ్చిన పాటలన్నీ నాకు నచ్చాయి. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకుంది.’ అని అన్నారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ .. ‘చంద్రహాస్ ఏం చేసినా జనాల్ని అట్రాక్ట్ చేస్తుంటాడు. ప్రభాకర్ కోసం నేను ఈ సినిమాని కచ్చితంగా చూస్తాను. కానిస్టేబుల్‌గా ప్రభాకర్ తన జీవితం ప్రారంభించి.. బుల్లితెరపై స్టార్‌గా ఎదిగాడు. ప్రభాకర్ జర్నీ అందరికీ ఇన్‌స్పిరేషన్. మేఘన అద్భుతంగా నటించినట్టుగా కనిపిస్తోంది. ధృవన్ సంగీతం నాకు చాలా నచ్చింది. ’ అని అన్నారు.