E-Paper
Advertisement

Toyota Rs 1 Lakh Discounts: టయోటా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గింపు!

Toyota  Rs 1 Lakh Discounts: టయోటా కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు, ఆ కార్లపై ఏకంగా రూ. లక్ష తగ్గింపు!
Advertisement

Toyota Cars  Discounts: ఆటో మోబైల్ దిగ్గజం టయోటా తన మోడల్స్ పై భారీగా ఆఫర్లు అందిస్తోంది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ. లక్షకు పైగా డిస్కౌంట్లు అందిస్తుంది. గ్లాంజా, హైరైడర్ కార్లు మరింత తగ్గింపును అందిస్తుంది. ఇన్వెంటరీని క్లియర్ చేయడంతో పాటు  ముందస్తు లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ మీరు టయోటా హ్యాచ్‌ బ్యాక్ లేదంటే  మిడ్‌ సైజ్ SUVని కొనుగోలు చేయాలనుకుంటే, భారీ తగ్గింపుతో వెంటనే కొనేయడం బెస్ట్.

గ్లాంజాపై భారీగా తగ్గింపు  

తాజాగా డిస్కౌంట్లలో భాగంగా గ్లాంజా మొత్తం రూ. 40,000 మేర ప్రయోజనాలను పొందుతుంది. రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ, కార్పొరేట్ పథకాల కింద రూ. 5,000 తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లతో వచ్చే G, V వేరియంట్లు మంచి అమ్మకాలను కొనసాగిస్తున్నాయి. టయోటా బ్యాడ్జ్ అప్పీల్‌ తో కూడిన పెట్రోల్ హ్యాచ్‌ బ్యాక్ కోసం చూస్తున్న ఎవరికైనా, ఈ రౌండ్ ఆఫర్‌లు సాధారణంగా ధరను భారీగా తగ్గించనున్నాయి.

హైరిడర్ హైబ్రిడ్‌లపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్

Advertisement

అర్బన్ క్రూయిజర్ హైరిడర్ పవర్‌ ట్రెయిన్ ద్వారా మరిన్ని వేరియంట్స్ ను కలిగి ఉంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు 27 కిలో మీటర్లకు పైగా మైలేజ్ పొందేందుకు పెట్రోల్ ఇంజిన్‌తో ఎలక్ట్రిక్ మోటారును యాడ్ చేస్తున్నారు. ఇక ఈ కారు మొత్తం ప్రయోజనాలలో రూ. 55,000 వరకు తగ్గింపు పొందనుంది. రూ. 15,000 క్యాష్ ఆఫర్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, పాత డీజిల్ SUVలను ట్రేడింగ్ చేసే వారికి డీలర్లు ఎక్స్ఛేంజ్‌ను మరింతగా అందించబోతున్నారు. మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్లకు రూ. 37,000 ప్రయోజనాలు లభిస్తుండగా, స్టాండర్డ్ పెట్రోల్, CNG రూ. 35,000 లభిస్తాయి.

హిలక్స్ మీద రూ. 1.05 లక్షల తగ్గింపు

టయోటా నుంచి వచ్చిన హిలక్స్ ట్రక్కులను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా టయోటా ఇండియన్ లైనప్‌ లో హిలక్స్ ఎల్లప్పుడూ నెమ్మదిగా అమ్ముడవుతోంది. ఫార్చ్యూనర్ డీజిల్‌ తో దాని ఇంజిన్, గేర్‌ బాక్స్‌ ను పంచుకునే పికప్ ట్రక్‌ను రూ. 1.05 లక్షల తగ్గింపుతో అందిస్తున్నారు.

ఇన్నోవా, ఫార్చ్యూనర్ మీద పరిమిత తగ్గింపు  

Advertisement

ఇన్నోవా క్రిస్టా అన్ని వేరియంట్లలో ఎక్స్ఛేంజ్, లాయల్టీ ప్రయోజనాలలో రూ. 20,000 పొందుతుంది. ఇన్నోవా హైక్రాస్ మరిన్ని ఆఫర్లను కలిగి ఉంది.  పెట్రోల్ GX, GX(O) వేరియంట్లకు రూ. 25,000 లభిస్తుండగా, హైబ్రిడ్ VX, ZX ట్రిమ్‌లకు రూ. 30,000 వరకు లభిస్తుంది.

Read Also: హీరో నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే భయ్యా!

ప్రస్తుతం గ్లాంజాపై రూ. 40,000, హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై రూ. 55,000 భారీగా తగ్గింపు అందిస్తుంది టయోటా. బాలెనో, హ్యుందాయ్ i20 లతో పోలిస్తే గ్లాంజా మరింత పోటీగా మారుతుంది. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో పోలిస్తే హైరైడర్ హైబ్రిడ్ మరింత బాగుంటుంది. ఒకవేళ మీరు టయోటా కార్లను తీసుకోవాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్ గా చెప్పుకోవచ్చు.

Read Also: భారత్ లో రెనాల్ట్ లోగో కంటే డస్టర్ లెటర్స్ పెద్దగా ఉంటాయి, ఎందుకో తెలుసా?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×