Barabar Premistha: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివాదంపై చిత్ర యూనిట్ ఎట్టకేలకు మౌనం వీడింది. స్టేజ్ మీద జరిగిన అనుచిత ప్రవర్తనపై నిర్మాత గాయత్రి చిన్ని, దర్శకుడు సంపత్ రుద్ర బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు.
Read als0-Feel Good Movie OTT: తండ్రికి దూరమయ్యే కొడుకు… భార్యను కాపాడలేక … ఎమోషన్ అంటే ఇదే మావా
యంగ్ హీరో చంద్రహాస్ నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, సినిమాలోని “గుంజీ గుంజీ” అనే పాటను పాడుతూ హీరో స్టేజ్ పై అసభ్య పదజాలం (బూతులు) ఉపయోగించారు. పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా? అంటూ నెటిజన్లు ఆయన్ని ట్రోల్ చేశారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కూడా ఈ ఘటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది.
ఈ వివాదంపై నిర్మాత, దర్శకుడు స్పందింస్తూ ఇలా చెప్పుకొచ్చారు.. నిర్మాత గాయత్రి చిన్ని మాట్లాడుతూ.. “ఒక సినిమాను నిర్మించేటప్పుడు ఎంతో బాధ్యతగా ఉంటాం. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో జరిగిన ఘటన మమ్మల్ని కూడా ఇబ్బందికి గురిచేసింది. పబ్లిసిటీ కోసం మేము కావాలని ఇలాంటి పనులు చేయము. ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి మేము విచారం వ్యక్తం చేస్తున్నాం.”
దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. “స్టేజ్ మీద చంద్రహాస్ అలా మాట్లాడతాడని మేము ఊహించలేదు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం. తక్కువ సమయంలో సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆవేశంలో ఆయన అలా చేసి ఉండవచ్చు. కానీ, ఒక దర్శకుడిగా ఆ పదజాలాన్ని నేను సమర్థించను.” అంటూ దర్శక నిర్మాతలు తమ విచారణ వ్యక్తం చేశారు.
Read also-Rajendra Prasad: పద్మశ్రీ రావడానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు
నిర్మాత, దర్శకులు విచారం వ్యక్తం చేసినప్పటికీ, హీరో చంద్రహాస్ మాత్రం తన ధోరణి మార్చుకోలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. “నన్ను తిట్టిన వాళ్ల భాషలోనే నేను సమాధానం చెప్పాను. నేను తప్పు చేశానని భావించడం లేదు, కాబట్టి క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదు” అని కుండబద్దలు కొట్టారు.
సినిమా రంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో యువ నటులు హద్దులు దాటుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి చూసే ఈవెంట్లలో ఇలాంటి భాష వాడటం సినిమా పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వివాదాల వల్ల సినిమాకు నెగటివ్ పబ్లిసిటీ వస్తుందా లేక కలెక్షన్లకు ప్లస్ అవుతుందా అనేది చూడాలి.
#బరాబర్ ప్రేమిస్తా వివాదం.. దర్శకుడు, నిర్మాతల ఆవేదన
'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో చంద్రహాస్ లైవ్‌లో పాడిన 'బూతు పాట' (గుంజీ గుంజీ) ఇప్పుడు ఇండస్ట్రీలో పెను దుమారం రేపుతోంది. ఈ ఘటనపై చిత్ర దర్శకుడు సంపత్ రుద్ర, నిర్మాతలు గెడా చందు, గాయత్రి చిన్ని తీవ్ర… pic.twitter.com/uXVbDxOr2T
— ChotaNews App (@ChotaNewsApp) February 5, 2026