E-Paper
Advertisement

Romantic movie OTT : విడుదలకు ముందే క్రేజీ ఓటీటీ డీల్… అనస్వర రొమాంటిక్ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

Romantic movie OTT : విడుదలకు ముందే క్రేజీ ఓటీటీ డీల్… అనస్వర రొమాంటిక్ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
Advertisement

Romantic movie OTT : ప్రేమికుల దినోత్సవానికి ముందు ఓ తమిళ రొమాంటిక్ మూవీ థియేటర్లలోకి వస్తోంది. ఇద్దరు మాజీ స్కూల్‌మేట్స్ అనుకోకుండా ఒక రోజు తిరిగి కలుసుకోవడంతో అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ వారం విడుదల కానున్న తమిళ రొమాంటిక్ మూవీలో ఒక ప్రముఖ దర్శకుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. మలయాళం నటి ఇందులో అలరించబోతోంది. ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. మరి ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలోకి వస్తుంది ? థియేటర్లలో ఎప్పుడు చూడచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలోకి రాబోతోంది అంటే

థియేటర్లలోకి రాబోయే ఈ తమిళ రొమాంటిక్ మూవీ పేరు ‘విత్ లవ్’ (With Love). ఇది ఈ వారం థియేటర్లలో విడుదల కానుంది. టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్ జీవింత్ ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేస్తుండగా, మలయాళ నటి అనస్వర రాజన్ ఈ తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ కొంతకాలం క్రితం విడుదల చేశారు. అది ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కలిగించేలా ఉంది.
ఇక ఈ సినిమా విడుదలకు ముందే స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత, మార్చిలో సదరు ఓటీటీ ప్రసారం చేసే అవకాశం ఉంది. ఈ రెండు గంటల 21 నిమిషాల సినిమా సెన్సార్ బోర్డు నుండి కూడా ‘U’ సర్టిఫికేట్ పొందింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రానికి మదన్ దర్శకత్వం వహించగా, షాన్ రోల్డన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

పెళ్లి సంబంధాలను ఇష్టపడని సత్య (అభిషన్ జీవింత్), తన సోదరి ఒత్తిడి మేరకు ఒక అమ్మాయిని కలవడానికి వెళతాడు. అక్కడ అతను మోనిష (అనశ్వర రాజన్)ను కలుస్తాడు. మాటల మధ్యలో వాళ్ళు ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు. వాళ్ళిద్దరూ కలిసి తమ చిన్ననాటి క్రష్‌లను, ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఒక ప్లాన్ వేస్తారు. ఈ ప్రయాణం సత్య, మోనిష జీవితాల్లో కొత్త మలుపులకు దారితీస్తుంది. ఆ మలుపులు ఏమిటి ? చివరికి వాళ్ళు తమ పాత ప్రేమికులను కలిశారా ? ఒకరికొకరు ప్రేమలో పడ్డారా ? అన్నది సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసే సినిమా… ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన ఫీల్ గుడ్ మూవీ

Tags

Related News

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×