E-Paper
Advertisement

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యరెడ్డిల పెళ్లి తేదీ ప్రకటన.. ఘనంగా లగ్నపత్రిక వేడుక!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యరెడ్డిల పెళ్లి తేదీ ప్రకటన.. ఘనంగా లగ్నపత్రిక వేడుక!
Advertisement

Bellamkonda srinivas: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈనెల 5వ తేదీ హైదరాబాద్ లో నిశ్చితార్థపు వేడుకను జరుపుకున్నారు. గత కొంతకాలంగా కావ్య రెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న సాయి శ్రీనివాస్ తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు తెలియజేస్తూ పెద్దల సమక్షంలో పెళ్లి వేడుకను జరుపుకోబోతున్నారు. ఈ జంట ఏప్రిల్ 5వ తేదీ నిశ్చితార్థం చేసుకోవడంతో ఏప్రిల్ 29వ తేదీ వీరి పెళ్లి తిరుపతిలో జరగబోతోంది అంటూ వార్తలు వచ్చాయి.

శ్రీనివాస్, కావ్య రెడ్డి లగ్నపత్రిక..

ఇలా వీరి వివాహం తిరుపతిలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఏప్రిల్ 29వ తేదీ జరగబోతోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు పెళ్లికి సంబంధించి అధికారికంగా ఎక్కడ వెల్లడించలేదు అయితే తాజాగా పెళ్లి పనులు ప్రారంభం కావడంతో ఇరువురి కుటుంబ సభ్యులు లగ్నపత్రిక వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక లగ్నపత్రిక వేడుకలో భాగంగా వీరి వివాహ తేదీని కూడా అధికారకంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విధంగానే వీరి వివాహం ఏప్రిల్ 29వ తేదీ తిరుపతిలో జరగబోతున్నట్లు తెలియజేశారు.

ఏప్రిల్ 29 న తిరుపతిలో వివాహం..

Advertisement

ఈ లగ్న పత్రిక వేడుకలో భాగంగా ఇరువురి కుటుంబ సభ్యులకు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి ట్రెడిషనల్ లుక్ అందరిని ఆకట్టుకుంది. ఏప్రిల్ 29వ తేదీ ఈ జంట కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకోబోతున్నారు .ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీలకు మే ఒకటవ తేదీ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక రిసెప్షన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విధంగా సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి పెళ్లి తేదీని ప్రకటించడంతో అభిమానులు కాబోయే కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గత రెండు సంవత్సరాలుగా కావ్య రెడ్డితో ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. కావ్య రెడ్డి ఫ్యామిలీ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీ కాదని చెప్పాలి. కావ్య రెడ్డి తండ్రి ప్రముఖ లాయర్ అని తెలుస్తుంది. వీరి కుటుంబానికి పెద్ద ఎత్తున వ్యాపారాలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని ఇంటి నుంచి కావ్య రెడ్డి బెల్లంకొండ ఇంటికి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు. ఇక పెళ్లికి కేవలం 20 రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో పసుపు దంచే వేడుక ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.

Also Read: పవన్ కళ్యాణ్ ను కలిసిన డైరెక్టర్ బాబీ.. మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారా?

 

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×