E-Paper
Advertisement

టెన్త్ క్లాస్‌తో భారీగా ఉద్యోగాలు.. చివరి తేది ఇదే భయ్యా

టెన్త్ క్లాస్‌తో భారీగా ఉద్యోగాలు.. చివరి తేది ఇదే భయ్యా
Advertisement

నిరుద్యోగులకు ఇది భారీ గుడ్ న్యూస్. కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మైనింగ్ సర్దార్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్‌మెన్ వంటి టెక్నికల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,055 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1055

Advertisement

ఈ రిక్రూట్‌మెంట్‌లో అత్యధికంగా మైనింగ్ సర్దార్ గ్రేడ్-సి విభాగంలో 577 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ ఫోర్‌మెన్ (ఎలక్ట్రికల్) గ్రేడ్-సి విభాగంలో 435 పోస్టులు కేటాయించారు. డిప్యూటీ సర్వేయర్ గ్రేడ్-సి విభాగంలో 43 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఆసక్తిని బట్టి సంబంధిత విభాగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత:  దరఖాస్తుదారులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు మైనింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ కలిగి ఉండటం తప్పనిసరి. వీటితో పాటు మైనింగ్ సిర్దార్‌షిప్, గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ లేదా సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్లు ఉండాలి.

Advertisement

వయోపరిమితి: వయస్సు 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయో సడలింపు లభిస్తుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 47,330 ప్రారంభ వేతనంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT) ద్వారా జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో టెక్నికల్ నాలెడ్జ్ విభాగానికి 80 మార్కులు కేటాయించారు. జనరల్ అవేర్‌నెస్ ఆప్టిట్యూడ్ విభాగానికి 20 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో నెగటివ్ మార్కులు లేకపోవడం అభ్యర్థులకు కలిసొచ్చే అంశం.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 1,180 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు: ఏప్రిల్ 15 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. మే 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://secl-cil.in/index

ALSO READ: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. 9,212 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×