E-Paper
Advertisement

పార్కుల పరిరక్షణలో బల్దియా ఫెయిల్..!

పార్కుల పరిరక్షణలో బల్దియా ఫెయిల్..!
Advertisement

Park Encroachment: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లోని జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో పెద్దన్నయ్య పాత్ర పోషించే జీహెచ్ఎంసీ పరిధిలో ఒక రకంగా, కొత్తగా ఏర్పాటైన రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మరో రకంగా పరిపాలన కొనసాగుతుంది. మూడు కార్పొరేషన్లలో అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన జీహెచ్ఎంసీ పార్కు స్థలాలను పరిరక్షించుకోవటంలో ఘోరంగా విఫలమవుతుండగా, కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు అదనంగా కొత్త పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ అధికారులు మరో అడుగు ముందుకేసి ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చే ముందు స్థలాలకు గేటుతో కూడిన ప్రహారీలను ఏర్పాటు చేయాలని కూడా కమిషనర్ సృజన అధికారులకు ఆదేశాలిచ్చారు. కానీ జీహెచ్ఎంసీలో పార్కు పట్ల విభిన్నమైన పరిస్తితి నెలకొంది. సేవ్ ఇందిరాపార్కు పేరిట వాకర్లు కొద్ది రోజుల ముందు మహా ధర్నా నిర్వహించినా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పార్కుల విభాగం ఆఫీసర్లు ఒక్కరూ కూడా ఈ పార్కు స్థలాన్ని సందర్శించిన పాపాన పోలేదు.

ఉచిత క్రీడా శిక్షణ పేరిట..

ఇదీ పార్కుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ చిత్తశుద్ధికి నిదర్శనమంటూ వాకర్లు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా చారిత్రక హైదరాబాద్ నగరంలో పేరుగాంచిన ఇందిరాపార్కులోని ఒక ఎకరం స్థలాన్ని కాజేసేందుకు ఆక్రమణదారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పార్కులో పాత స్కేటింగ్ రింగు కోసం వినియోగించిన ఈ స్థలాన్ని ఉచిత క్రీడా శిక్షణ పేరిట కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారన్న విషయాన్ని కొద్ది రోజుల క్రితం స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెల్సిందే. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఇందిరాపార్కులోని ఎకరం స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నాలకు హైడ్రా చెక్ పెట్టింది. అంతేగాక, ఆ ఎకరం స్థలాన్ని జీహెచ్ఎంసీలో పార్కుల ఏర్పాటు నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న అర్బన్ బయో డైవర్శిటీ (యూబీడీ)కి అప్పగించాలని కూడా హైడ్రా సిఫార్సు చేసింది. కానీ హైడ్రా సూచించిన చాలా రోజుల తర్వాత ఆ ఎకరం స్థలాన్ని యూబీడీకి అప్పగించినట్టే అప్పగించి, మళ్లీ స్పోర్ట్స్ వింగ్ కు బదలాయించారు.

కమిషనర్ సంచలన నిర్ణయం

Advertisement

ఈ మేరకు ఈ నెల 17వ తేదీన యూబీడీ మేనేజర్ ను ఆదేశిస్తూ జీహెచ్ఎంసీ లిఖితపూర్వకమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో ఖాళీ స్థలాలను కూడా పార్కులుగా మార్చాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేయగా, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏకంగా పదుల సంఖ్యలో కొత్త థీమ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కానీ జీహెచ్ఎంసీ పరిదిలోని ఇందిపార్కులోని ఎకరం స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు, కొందరు జీహెచ్ఎంసీ అధికారులు, ఓ ప్రజాప్రతినిధి స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అధికారులు పావులుగా మారుతున్నారే తప్పా, పార్కు స్థలం పరిరక్షణకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవటం గమనార్హం. పైగా ఈ స్థలాన్ని యూబీడీకి అప్పగించినట్టే అప్పగించి, మళ్లీ క్రీడల విభాగానికి బదలాయించటం హాట్ టాపిక్ గా మారింది.

Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వ శిక్షణతో విదేశాల్లో ఉద్యోగాలు..!

పార్కు స్థలాన్ని క్రీడలకు వినియోగించాలంటే?

Advertisement

పార్కు స్థలంలో కేవలం గ్రీనరీని మాత్రమే డెవలప్ చేయాలని న్యాయస్థానాల ఆదేశాలున్నప్పటికీ, ఇందిరాపార్కులోని ఎకరం స్థల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలను పక్కనబెట్టి వ్యవహారిస్తున్నట్లు తేలిపోయింది. తొలుత స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన సమయంలో రంగంలోకి దిగిన హైడ్రా ఆ ఎకరం స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు వేసిన మెటీరియల్ ను తొలగించి, ఈ స్థలాన్ని పార్కుగా మార్చేందుకు వీలుగా అర్బన్ బయో డైవర్శిటీ (యూబీడీ)కి అప్పగించాలని సూచించినా, చాలా రోజుల తర్వాత అధికారులు ఈ స్థలాన్ని యూబీడికి అప్పగిస్తూనే మళ్లీ క్రీడా వింగ్ కు బదలాయించారు.

నిబంధనల ప్రకారం..

కానీ నిబంధనల ప్రకారం పార్కు స్థలాన్ని ప్రత్యామ్నాయంగా వినియోగించాలంటే ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ ముందు పెట్టి, ఆమోదించిన తర్వాత మళ్లీ కౌన్సిల్ ఆమోదం తీసుకున్న తర్వాతే ప్రత్యామ్నాయంగా వినియోగించాల్సి ఉంది. కానీ ఈ స్థలం విషయంలో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎలాంటి నిబంధనలను పాటించకుండానే యూబీడీ నుంచి సోర్ట్స్ వింగ్ కు ఈ ఎకరం స్థలాన్ని బదలాయించింది. కానీ పట్టణ ప్రాంతాల్లో రోజురోజుకి కాంక్రీట్ జంగిల్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఉన్న పార్కులను కాపాడుకోవాలని న్యాయ స్థానాలు చెబుతుంటే జీహెచ్ఎంసీ పార్కు స్థలాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు వారు చేస్తున్న పైరవీల పట్ల ప్రేక్షక పాత్ర పోషిస్తుందే తప్పా, నేరుగా రంగంలోకి దిగకపోవటం పలు అనుమానాలకు తావిస్తుంది.

ఎంఎంసీలో రకరకాల థీమ్ పార్కులు

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కుల సంరక్షణతో పాటు పార్కులను సరి కొత్త పద్దతిలో అభివృద్ది చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. స్పోర్ట్స్ థీమ్ పార్కు,బర్డ్స్ ధీమ్ పార్కు, రాక్ గార్డెన్ థీమ్ పార్కు, బట్టర్ ఫ్లై థీమ్ పార్కు, ఫ్రాగ్రెన్స్ గార్డెన్ థీమ్ పార్కు, పాల్మటమ్ థీమ్ పార్కు, మ్యూజికల్ కాన్సెప్ట్ థీమ్ పార్కు, అక్యుపేషనల్ థీమ్ పార్కు( చేతి వృత్తుల కాన్సెప్టు), రెయిన్ బో గార్డెన్ థీమ్ పార్కు, రోజ్ గార్డెన్, పెట్రొయిటిక్ థీమ్ పార్కు,సీజనల్ థీమ్ పార్కు, యానిమల్ కింగ్ డమ్ థీమ్ పార్కు, మేజ్ థీమ్ పార్కు వంటి రకరకాలుగా పార్కులను అభివృద్ది చేస్తున్నారు.

Also Read: విద్యార్ధుల ఆరోగ్యంపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్.. ఆ రెండు ట్రస్టులకు అల్పాహార భాద్యతలు..?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×