E-Paper
Advertisement

Tanveer Ahmed: రాసిపెట్టుకోండి…వ‌చ్చే PSLలో మహ్మద్ అమీర్ ను ఎవ‌డు కొనుగోలు చేశారు

Tanveer Ahmed: రాసిపెట్టుకోండి…వ‌చ్చే PSLలో మహ్మద్ అమీర్ ను ఎవ‌డు కొనుగోలు చేశారు
Advertisement

Tanveer Ahmed:  ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు ( Indian Premier League 2026 Tournament ) పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్న‌మెంట్ 2026 ( Pakistan Super League Tournament 2026) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 26వ తేదీన ప్రారంభమైన పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ను ( Mohammad Amir) ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. వచ్చే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో మహమ్మద్ అమీర్ ను ఎవడు కూడా కొనుగోలు చేయ‌బోరని బాంబు పేల్చారు. ఈ సీజన్ లో రావల్పిండిజ్ జట్టు ( Rawalpindiz,) తరఫున ఆడినప్పటికీ… వచ్చే టోర్నమెంట్ సమయానికి వాళ్లు కూడా రిటైన్ చేసుకునే ఛాన్స్ లేదని తెలిపారు. మిగిలిన ఫ్రాంచైజీలు కూడా మహమ్మద్ అమీర్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం కష్టమేనని కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Lungi Ngidi injury: కేవ‌లం 11 నిమిషాలే, ఇండియా తడాఖా ఏంటో చూపించిన‌ ఢిల్లీ పోలీసులు, గ్రీన్ కారిడార్ వేసి మరీ

వ‌చ్చే PSLలో మహ్మద్ అమీర్ ను ఎవ‌డు కొనుగోలు చేశారు

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) భాగంగా ఇవాళ హైదరాబాద్ కింగ్స్‌మెన్ vs రావల్పిండిజ్ జట్ల మధ్య 39వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కరాచీలోని నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించారు. అయితే ఇందులో హైదరాబాద్ కింగ్స్ మెన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్ణీత‌ 20 ఓవర్లు ఆడిన హైదరాబాద్ కింగ్స్ మెన్, ఆరు వికెట్ల నష్టానికి 244 పరుగులు సాధించింది. రావల్పిండిజ్ జట్టు బౌలర్లు విరాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో హైదరాబాద్ భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే ఇదే మ్యాచ్ లో రావల్పిండిజ్ తరఫున బౌలింగ్ చేసిన మహమ్మద్ అమీర్ నాలుగు ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు.

ఒక్క వికెట్ కూడా పడగొట్టలేదు. గత మ్యాచ్ లలో కూడా అతని ప్రదర్శన ఏ మాత్రం బాగాలేదు. ఈ క్రమంలోనే మహమ్మద్ అమీర్ పరువు తీసేలా తన్వీర్ అహ్మద్ హాట్ కామెంట్స్ చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుతున్న మహమ్మద్ అమీర్ ను… వచ్చే సీజన్ లో రావల్పిండిజ్ జట్టు రిటైన్ చేసుకోవడం కష్టమేనన్నారు. రావల్పిండిజ్ ఒక్క‌టే కాదు, పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ టోర్నమెంట్ లోని ఏ జ‌ట్టు ఫ్రాంచైజీ కూడా అమీర్ ను కొనుగోలు చేసే ఛాన్సే లేద‌ని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ టోర్నమెంట్ 2026 కోసం మ‌హ్మ‌ద్ అమీర్ ను 5.4 కోట్ల PKRకు సొంతం చేసుకుంది రావల్పిండిజ్.

Advertisement

Also Read: Inzamam-ul-Haq : నా కొడుకు కాలి గోటికి కూడా వైభ‌వ్ స‌రిపోడు..ఐపీఎల్ లో ఛాన్స్ ఇచ్చి చూడండి, తడాఖా చూపిస్తాడు ( Muttiah Muralitharan)

 

 

https://www.facebook.com/khelshel/posts/tanveer-ahmed-believes-this-will-be-the-last-psl-for-mohammad-amir-and-no-team-w/1539336160889997/

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×