E-Paper
Advertisement

Best Telugu Love Songs: ‘నిజమే నే చెబుతున్నా’ నుంచి ‘సహన సహన’ వరకు.. బెస్ట్ 20 తెలుగు లవ్ సాంగ్స్ ఇవే!

Best Telugu Love Songs: ‘నిజమే నే చెబుతున్నా’ నుంచి ‘సహన సహన’ వరకు.. బెస్ట్ 20 తెలుగు లవ్ సాంగ్స్ ఇవే!

Best Telugu Love Songs: ప్రేమ… రెండు మనసులను కలిపే ఒక మధురమైన అనుభూతి. కాలం మారుతున్నా, ప్రేమికుల మధ్య ఆత్మీయతను పెంచేది మాత్రం నిరంతరం ప్రవహించే సంగీతమే అని చెప్పుకోవాలి. ఫిబ్రవరి 14న ప్రపంచమంతా వాలెంటైన్స్ డే (Valentine’s Day) జరుపుకుంటున్న వేళ, ప్రేమికుల హృదయాల్లోని భావాలను ప్రతిబింబించేలా అద్భుతమైన పాటలతో ఈ రోజును మరింత స్పెషల్‌గా మార్చుకోవచ్చు. పాత తరం క్లాసిక్ మెలోడీల నుండి నేటి యూత్ హార్ట్ బీట్ పెంచుతున్న లేటెస్ట్ సాంగ్స్ వరకు, తెలుగు సినిమా మనకు ఎన్నో అపురూపమైన ప్రేమ గీతాలను అందించింది. ప్రేమ పాట అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ‘క్రిమినల్’ సినిమాలోని ‘తెలుసా మనసా’. ఇలా చెప్పుకుంటే ప్రేమపై వచ్చిన వింటేజ్ సాంగ్స్ చాలానే ఉన్నాయి.  ఇళయరాజా, రెహమాన్, కీరవాణి.. ఇలా ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్‌.. కొన్ని ప్రేమ పాటల్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా యూత్‌కి ఆస్తిగా ఇచ్చారు. అలా, ఈ మధ్యకాలంలో ప్రేమపై వచ్చిన అద్భుతమైన 20 తెలుగు లవ్ సాంగ్స్ (Best Telugu Love Songs) జాబితా మీకోసం…

Also Read- Valentine’s day Wishes Telugu: మనసుని తాకే మధురమైన ప్రేమ కవితలు.. వాలెంటైన్స్ డే స్పెషల్

Best Telugu Love Songs: బెస్ట్ 20 తెలుగు లవ్ సాంగ్స్ లిస్ట్

చికిరి చికిరి- (పెద్ది)
నిజమే నే చెబుతున్నా- (ఊరు పేరు భైరవకోన)
ఒకే ఒక లోకం- (శశి)
సహన సహన- (ది రాజా సాబ్)
చుట్టమల్లే- (దేవర)
చిన్ని గుండెలో- (ఆంధ్ర కింగ్ తాలుకా)
సువ్వి సువ్వి- (ఓజీ)
ఎవరెవరో- (యానిమల్)
ఓ రెండు ప్రేమ మేఘాలిలా- (బేబీ)
సమయమా- (హాయ్ నాన్న)
ఆరాధ్య- (ఖుషి)
మాస్టారు మాస్టారు- (సార్)
బుజ్జి తల్లీ- (తండేల్)
మేడం సర్ మేడం అంతే- (టిల్లు స్క్వేర్)
ప్రేమ వెల్లువ- (హిట్ 3)
అనువనువూ- (ఓం భీమ్ బుష్)
చూసి చూడంగానే- (ఛలో)
ఇంకేం ఇంకేం కావాలే- (గీత గోవిందం)
పిల్ల రా- (RX100)
జల జల జలపాతం- (ఉప్పెన)

Also Read- Best Romantic Web Series : ఓటీటీలో ఉన్న బెస్ట్ రొమాంటిక్ వెబ్ సిరీస్ లు… గర్ల్ ఫ్రెండ్ తో డోంట్ వాచ్

హ్యాపీ వాలెంటైన్స్ డే

ప్రేమ అనేది ఒక అద్భుతమైన ప్రయాణం అయితే, ఆ ప్రయాణంలో తోడు నిలిచే మధురమైన జ్ఞాపకం సంగీతం. మనసులోని మాటను పెదవి దాటనీయకుండానే, ఒక పాట ద్వారా అవతలి వ్యక్తి హృదయాన్ని తాకవచ్చు. నిజమైన ప్రేమను వ్యక్తపరచడానికి భాష కంటే భావమే ముఖ్యం, ఆ భావానికి సంగీతం తోడైతే అది మరింత మధురంగా మారుతుంది. పైన పేర్కొన్న పాటలన్నీ కేవలం బాణీలు మాత్రమే కాదు, ప్రతి ప్రేమికుడి మనసులోని మాటలు. ఈ వాలెంటైన్స్ డే నాడు మీకిష్టమైన వారితో కలిసి ఈ పాటలను వింటూ, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. ప్రేమికుల మధ్య చిన్నపాటి అలకలైనా, తీపి కబురులైనా.. ఒక మంచి పాటతో అన్నీ సర్దుకుపోతాయి. అందుకే, ఈ స్పెషల్ డేని మ్యూజికల్‌గా ఎంజాయ్ చేయండి! హ్యాపీ వాలెంటైన్స్ డే!

Also Read- Valentine’s day Movies: వాలెంటైన్స్ డే స్పెషల్.. టాప్ 10 రొమాంటిక్ తెలుగు సినిమాలివే!

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×