E-Paper
Advertisement

Sunil: ‘పుష్ప’ ఎఫెక్ట్.. హైదరాబాద్ వదిలేసిన సునీల్.. ఫోన్ చేస్తే చాలు!

Sunil: ‘పుష్ప’ ఎఫెక్ట్.. హైదరాబాద్ వదిలేసిన సునీల్.. ఫోన్ చేస్తే చాలు!
Advertisement

Sunil: తెలుగు చిత్రసీమలో కమెడియన్, విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న వారిలో సునీల్ (Sunil) ఒకరు. కేవలం నవ్వులు పూయించే హాస్యనటుడిగానే కాకుండా హీరోగా, విలన్‌గా కూడా సత్తా చాటుతున్నారు. ఈ మధ్యకాలంలో హీరోగా మానేశారు కానీ, ‘పుష్ప’ తర్వాత ఆయన రేంజే మారిపోయింది. 2000వ దశకంలో సునీల్ లేని సినిమా ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఆయన కామెడీ టైమింగ్ ఒక ఊపు ఊపేసింది. బాడీ లాంగ్వేజ్‌తోనే నవ్వు తెప్పించడం ఆయన ప్రత్యేకత. ఒకానొక టైమ్‌లో అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డ సునీల్‌కు మళ్లీ తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాసే లైఫ్ ఇచ్చారు. అప్పటి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా ఏ అవకాశం వస్తే అది చేసుకుంటూ దూసుకెళ్లిపోతున్నారు. ‘పుష్ప’లో ఆయన పోషించిన మంగళం శీను పాత్రకు ఎటువంటి గుర్తింపు వచ్చిందో, ఆ పాత్ర ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత సునీల్ హైదరాబాద్‌లోనే దొరకడం లేదట.

Also Read- Band Melam: బ్యాండ్ మేళానికి వేళాయెరా.. ఆ డేట్ పడతారని అస్సలు ఊహించలేదు!

హైదరాబాద్‌లోనే ఉండటం లేదు..

Advertisement

అవును, ఈ విషయం కమెడియన్ ప్రవీణ్ (Praveen) ఓ పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘‘సునీల్ ఇప్పుడు తమిళం, మలయాళంలో ఫుల్ బిజీ అయిపోయాడు. అన్నయ్యా ఎక్కడున్నావ్ అంటే.. వయనాడ్ రా. మరోసారి కాల్ చేసి ఎక్కడున్నావ్ అంటే.. కొచ్చిలో ఉన్నాను రా. మమ్ముట్టిగారి సినిమా ఇప్పుడే అయ్యింది.. లేదంటే అజిత్ గారి సినిమా ఇప్పుడే అయ్యిందని చెబుతుంటాడు. ‘పుష్ప’ (Pushpa) సినిమా ఎఫెక్ట్‌కి అసలు హైదరాబాద్‌లో ఉండటమే తక్కువైపోయింది. రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ కోసం వచ్చి రెండు రోజులు ఉండి వెంటనే వెళ్లిపోయాడు. అంత బిజీ అయిపోయాడు’’ అని ప్రవీణ్ ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. హీరోగా వరుస ప్లాప్స్‌తో ఉన్న సునీల్‌కు ఏం చేయాలో తెలియక కొన్నాళ్లు కామ్‌గా ఉన్న విషయం తెలియంది కాదు. ఆ టైమ్‌లో ఆయనకు అవకాశాలేవీ రాలేదు. దీంతో మళ్లీ తన కామెడీ గూటికి చేరాలని డిసైడ్ అయ్యారు.

Also Read- Supritha: సురేఖ వాణి రెండో పెళ్లి పై సుప్రీత కామెంట్స్… తప్పుగా అర్థం చేసుకున్నారా?

పాన్ ఇండియా బిజీ నటుడిగా..

Advertisement

కట్ చేస్తే, విలన్ పాత్రలు ఎక్కువగా రావడం మొదలయ్యాయి. ‘పుష్ప’లో చేసిన పాత్రకు సరిగ్గా అతికినట్లుగా సరిపోవడం, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో సునీల్ మళ్లీ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం సౌత్‌లో బిజీ నటులలో ఒకరిగా సునీల్ మారిపోయారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా పాన్ ఇండియా భాషల్లో ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. ప్రతి భాషలోనూ ఆయనకు మంచి పాత్రలే పడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం సునీల్ టైమ్ నడుస్తుందని అనుకోవచ్చు. అందుకే అంటుంటారు.. ప్రతి ఒక్కరికి ఒక టైమ్ అనేది వస్తుందని. అలా సునీల్‌కు గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. తనకు వచ్చిన అవకాశాలను ఆయన చక్కగా సద్వినియోగం చేసుకుంటూ, నటుడిగా తనలోని విలక్షణీయతను చాటుకుంటున్నారు.

Also Read- Supritha: మా ఏడుపుల మీద డబ్బులు ఏరుకుంటున్నారు.. నెగిటివిటీ పై సుప్రీత కామెంట్స్!

Related News

కావ్యతో పెళ్లి.. వైరల్ గా మారిన అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్!

జైలర్ 2 మూవీ.. రజిని మనవడి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ముగ్గురు అరెస్ట్!

విజయ్, ర‌ష్మిక మైల్ స్టోన్ మూవీగా ‘రణబాలి’.. బ్లాక్ బస్టర్ టాక్ తో దూకుడు..

రామ్ పోతినేని సినిమాలో జెనిలియా భర్త.. వీడియో వైరల్!

డైరెక్టర్ పై సోనాలి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.. నిర్మానుష్య ప్రాంతంలో?

కావ్యతో అనిరుద్ పెళ్ళి…కట్నం ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

చిరంజీవి కాకా మూవీ నుండి సీన్ లీక్.. ఊరమాస్ గెటప్ లో అదుర్స్!

Big Stories

Advertisement
×