E-Paper
Advertisement

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?
Advertisement

 NTR God of War: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గాడ్ ఆఫ్ వార్ సినిమాపై క్లారిటీ ఇస్తూ రీసెంట్ గా సాలిడ్ పోస్టర్ వదిలాడు.ఇంకేం ఇదే కదా మాక్కావాల్సింది అంటూ మురిపోయారు తారక్ ఫ్యాన్స్.ఇక ఈ సినిమా గురూజీ తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం తర్వాత సెట్ మీదకి వెళ్ళే చాన్స్ పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.అయితే తారక్ తో ఈ సినిమాలో జోడీ కట్టే ఆ ముద్దుగుమ్మ ఎవరా అంటూ ఆరాలు తీసేపనిలో పడ్డారంతా.

ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్న మేకర్స్

Advertisement

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ముద్దుగుమ్మ ఈ భామే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ తెగ సర్క్యులేట్ అవుతుంది.ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారా ..?తనే కియారా అద్వానీ.చరణ్ తో వినయవిధేయరామ, గేమ్ చేంజర్, మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలలో కల్సి నటించింది ఈ ముద్దుగుమ్మే.మరో వైపు సుక్కు, చరణ్ కాంబోలో వచ్చే సినిమా కోసం కూడా ఈ అమ్మడైతే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట మేకర్స్.ఒక వేళ ఈ భామే ఫైనల్ అయితే మాత్రం ఆ సినిమాలకి ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోనూ మరింత క్రేజ్ రావడం ఖాయం.

also read:భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Advertisement

ఆన్ బోర్డ్ అవుతుందా లేక మరో భామకి సైడ్ ఇస్తుందా ?

అసలే గురూజీ సినిమాల్లో హీరోయిన్ ని నెక్స్ట్ లెవెల్ చూపిస్తుంటాడు.అలాంటిది భారీ మైథలాజికల్ విజువల్ వండర్ లో గనుక నిజంగానే కియారా ఛాన్స్ దక్కించుకుంటే ఆ మాత్రం టాలీవుడ్ లో ఈ అమ్మడు మరిన్ని రోజులు ఒక వెలుగు వెలగడం ఖాయం.చూడాలి మరి చక్కర్లు కొడుతున్నట్టుగా ఈ అమ్మడే ఆన్ బోర్డ్ అవుతుందా లేక మరో భామకి సైడ్ ఇస్తుందా ?

ఇక తారక్ విషయానికి వస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాని జూన్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్.

సల్మాన్ ఖాన్ సలహా మేరకు కియరా అద్వానీ గా

ఇక కియరా విషయానికి వస్తే 1991జూలై 31న బాంబేలో పుట్టిన ఆమె అసలు పేరు ఆలియా అద్వాని.కానీ అదే పేరు తో ఆలియా భట్ ఉండటంతో సల్మాన్ ఖాన్ సలహా మేరకు కియరా అద్వానీ గా మార్చుకుందట.ఇక సినిమాల్లోకి వచ్చే ముందు ఒక ప్రీ స్కూల్ లో పంతులమ్మగా పని చేసిందట ఈ బాంబే బ్యూటీ.దానికి తన తల్లే హెడ్ మాస్టర్ గా ఉండటం విశేషం.

ఇకఆమె నటించిన తొలి సినిమా ‘ఫగ్లీ’సక్సెస్ కాకపోయినప్పటికీ డిసప్పాయింట్ కాకుండా ఎం.ఎస్. ధోని, భరత్ అనే నేను, కబీర్ సింగ్, షేర్‌షా వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కియరా 2023లో తన బాయ్ ఫ్రెండ్ సిద్దార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుంది  .ఇక ప్రస్తుతం యష్ హీరోగా వస్తున్న టాక్సిక్ సినిమాలో సంగతి తెల్సిందే.

also read:‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×