E-Paper
Advertisement

Bhagya Shri Borse: మద్యపాన నిషేధం నేపథ్యంలో భాగ్యశ్రీ కొత్త సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్!

Bhagya Shri Borse: మద్యపాన నిషేధం నేపథ్యంలో భాగ్యశ్రీ కొత్త సినిమా.. టైటిల్ కూడా ఫిక్స్!
Advertisement

Bhagya Shri Borse: భాగ్యశ్రీ హీరోయిన్ గా ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈమె రామ్ పోతినేని తో కలిసి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నప్పటికీ అంచనాలను చేరుకోవడంలో కాస్త విఫలమైంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు సరైన సక్సెస్ మాత్రం భాగ్యశ్రీ అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈమె అక్కినేని హీరోతో కలిసి లెనిన్(Lenin) అనే సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా ఈమెకు అదృష్టాన్ని తీసుకొస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ఇలా భాగ్యశ్రీ(Bhagya Shri) నటించిన వరుస సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిన ఈమెకు మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి.

చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా..

భాగ్యశ్రీ మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యారని తెలుస్తోంది. మద్యపానం నిషేధం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఈ సినిమాని స్వప్న సినిమా నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి రమేష్ అనే నూతన దర్శకుడు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం “చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా” (chukkalu temmanna tenchukurana) అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి తదుపరి వివరాలన్నింటిని కూడా అధికారికంగా వెల్లడించబోతున్నట్లు సమాచారం.

స్వప్న సినిమా నిర్మాణంలో..

Advertisement

ఇక స్వప్న నిర్మాణ సంస్థలో ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నాయి.. మహానటి, సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాణ సంస్థలో భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించబోతున్నారనే విషయం తెలియజేయడంతో ఈ సినిమా పట్ల మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమాలో హీరో ఎవరు? ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

లెనిన్ అయినా హిట్ ఇచ్చేనా?

Advertisement

ఇక ప్రస్తుతం భాగ్యశ్రీ లెనిన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా శ్రీ లీలను ఎంపిక చేశారు ఆమెపై కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది అయితే శ్రీ లీలపై షూట్ చేసిన సన్నివేశాలను ఇప్పుడు భాగ్యశ్రీ తో షూట్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాని ఫిబ్రవరి 14వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై అక్కినేని అఖిల్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అఖిల్ భావిస్తున్నారు. మరి భాగ్యశ్రీ, అఖిల్ ఇద్దరికీ ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Actress Himaja: బిగ్ బాస్ హిమజ ఇంట తీవ్ర విషాదం..మాటలలో చెప్పలేనంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×