E-Paper
Advertisement

Actress Himaja: బిగ్ బాస్ హిమజ ఇంట తీవ్ర విషాదం..మాటలలో చెప్పలేనంటూ!

Actress Himaja: బిగ్ బాస్ హిమజ ఇంట తీవ్ర విషాదం..మాటలలో చెప్పలేనంటూ!
Advertisement

Actress Himaja: హిమజ పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హిమజ అనంతరం బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss 4)రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉంటూ సినిమాలలో నటిస్తున్నారు. ఇక సినిమాలో చిన్న చిన్న పాత్రలలో అయిన కూడా ప్రాధాన్యత ఉంటే హిమజ(Himaja) నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు యూట్యూబ్ వీడియోస్, ఇంస్టాగ్రామ్ రీల్స్ అంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాన్న..

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే హిమజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొందని తెలుస్తోంది. హిమజ తండ్రి మరణించారనే విషయాన్ని ఆమె స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఆ స్వర్గం లవింగ్ సోల్ ను తీసుకెళ్లి పోయింది మాటలలో చెప్పలేనంతగా నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను నాన్న అంటూ ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా తండ్రితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలబ్రిటీలు హిమజ తండ్రి మరణం పట్ల స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

స్టార్ హీరోలో సినిమాలలో అవకాశాలు..

Advertisement

ఇలా హిమజ తండ్రి మరణించడంతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు ఈమెకు ధైర్యం నింపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇక హిమజ కెరియర్ విషయానికి వస్తే ఇటీవల బుల్లితెర సీరియల్స్ కు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. కేవలం బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇక సినిమాలలో కీలక ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. బిగ్ బాస్ తర్వాత హిమజ సినిమాల పైన ఎక్కువగా ఫోకస్ చేశారని తెలుస్తోంది. ఎన్టీఆర్ బాలకృష్ణ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నారు.

?igsh=MWk3bWxqemM2NHJycQ%3D%3D

Advertisement

ఇక ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని చెప్పాలి. పెద్ద ఎత్తున యూట్యూబ్లో సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్న హిమజ నిత్యం తనకు సంబంధించిన అన్ని వీడియోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. ఇలా యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఇక హిమజ సంపాదనతో ఇప్పటికే భారీ స్థాయిలో ఆస్తులను కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా కెరియర్ పరంగా వ్యక్తిగత జీవితంలో కూడా మంచి సక్సెస్ అందుకొని సంతోషంగా ఉన్న హిమజ తాజాగా తన తండ్రిని కోల్పోవడం ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.

Also Read: Balakrishna- Akhanda 2: అఖండ 2 రిలీజ్ తర్వాత బాలయ్య ఫస్ట్ రియాక్షన్.. అభిమానితో ఏం అన్నాడంటే?

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×