E-Paper
Advertisement

Tomatoes: టమాటాల వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?.. డాక్టర్లు చెప్పిన నిజాలు వింటే నమ్మలేరు!

Tomatoes: టమాటాల వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా?.. డాక్టర్లు చెప్పిన నిజాలు వింటే నమ్మలేరు!
Advertisement

Tomatoes: ఇప్పటికీ చాలామంది నమ్మకం ఏమిటంటే.. ‘ఎక్కువగా టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి’ అని. కానీ నిజానికి సైన్సు పరంగా చూసుకుంటే.. ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు వైద్య నిపుణులు. టమాటాల్లో కొంత ఆక్సలేట్ ఉండటం నిజమే. కానీ శరీరానికి హాని చేసే మోతాదులో అది లేదు. 100 గ్రాముల టమాటాలో సుమారు 5 మిల్లీగ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి.. టమోటాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది అసాధ్యం అంటున్నారు నిపుణులు. మరి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్య కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..

తగినంత నీరు తీసుకోకపోవడం:

పలు అధ్యయనాల ప్రకారం.. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్య కారణం.. నీటి లోపమేనట. రోజంతా తగినంత నీరు తాగకపోతే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లడానికి ఆస్కారం ఉండదు. దీంతో మూత్రపిండాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు.. కాల్షియం ఆక్సలేట్ లేదా ఇతర రకాల స్ఫటికాలుగా మారి రాళ్లుగా ఏర్పడుతాయి. అందుకే రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల మంచి నీళ్లు తాగడం మంచిది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

Advertisement

Also Read: కాబోయే అమ్మలూ.. శీతాకాలంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనట!

ఇతర కారణాలు:

ఇకపోతే.. మరికొన్ని జెనెటిక్ కారణాలు, ఎంజైమ్ లోపం, శరీర జీవక్రియల అసమతుల్యత వలన కూడా కిడ్నీలో రాళ్లు పురుడు పోసుకుంటాయి. కాబట్టి.. కేవలం ఆహారం వల్ల మాత్రమే కిడ్నీలో రాళ్లు వస్తుందని నమ్మకూడదు. స్ట్రువైట్, యూరిక్ యాసిడ్, సిస్టీన్ రాళ్లు వంటి రకాలు కూడా శరీర లోపాలపై ఆధారపడి వస్తాయి. కాబట్టి మొదట మన అనారోగ్య సమస్యలపైనా దృష్టి సారించాలి.

ఆహారంలో మార్పులు తప్పనిసరి:

Advertisement

అలాగే మధుమేహం, హై బీపీ, కిడ్నీ సమస్యలున్నవారు ఇష్టానుసారంగా ప్రొటీన్‌ను తీసుకోకూడదు. జిమ్‌కి వెళ్తున్నామని, వ్యాయామ శ్రమ చేస్తున్నామని ఎక్కువగా ప్రొటీన్ తీసుకుంటే.. ఆ ప్రభావం  మూత్రపిండాలపై ఒత్తిడి పెంచుతుంది. అందువల్ల మధుమేహులు, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం చాాలా ముఖ్యం.

అపోహ మాత్రమే:

వైద్యలు తెలిపిన సమాచారం ప్రకారం.. టమాటాలు ఆరోగ్యానికి మంచివే. వాటిని తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని భయపడాల్సిన అవసరం లేదు. రోజంతా తగినంత నీరు తాగడం, మంచి పోషకాలు కూడిన ఆహారం తీసుకోవడం, మన శరీరంలో జరిగే మార్పులను గమనించడం ద్వారా కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

Also Read: శీతాకాలంలో చిలగడదుంప ఎందుకు తినాలో తెలుసా?.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Related News

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

Big Stories

Advertisement
×