Bhagyasri Borse Comments on Marriage: భాగ్య భోర్సే అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. అంతేకాదు తనదైన నటనతో దర్శకనిర్మాతలను మెప్పిస్తుంది. కానీ, ఆమె లక్ మాత్రం తక్కువే అని చెప్పోచ్చు. తొలి చిత్రంతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఒక్క పాటతో రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. కానీ, ఆ సినిమా భారీ డిజాస్టర్. డెబ్యూ చిత్రంతో భాగ్య శ్రీ ఘోరమైన పరాజయం చూసింది. అయినా ఆమె క్రేజ్ తగ్గలేదు. వెంటనే విజయ్ దేవరకొండ కింగ్ డమ్ ఆఫర్ కొట్టేసింది. ఇండస్ట్రీ హిట్, మినిమమ్ రూ. 500 కోట్ల చిత్రమనుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
అసలు ఈ మూవీలో భాగ్యశ్రీ కనిపించనే లేదని చెప్పాలి. కనిపించేందే కొన్ని సీన్లలో. మూవీ హిట్ అయితే ఆమెకు కాస్తా పేరొచ్చేదేమో. కానీ, కింగ్ డమ్ కూడా ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. మూడో చిత్రానికి ఏకంగా పాన్ ఇండియా హీరో దుల్కర్ సల్మాన్ తో జతకట్టింది. అసలు ఈ మధ్య హీరోకి ప్లాప్ అనేది లేదు. దీంతో దుల్కర్ లక్ ఏమైనా భాగ్యశ్రీకి వర్కౌట్ అవుతుందని ఫ్యాన్స్ అంత ఆశపడ్డారు. కానీ, ఆమె అన్ లక్ ముందు దల్కర్ లక్క్ కూడా బొల్తా పడింది. కాంత మూవీ ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆమె రామ్ పోతినేనితో ఆంధ్రకింగ్ తాలుకా మూవీ చేస్తుంది. ఈ భామ ఆశలన్ని ఈ సినిమాపైనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే రామ్ పోతినేనితో ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి భాగ్య శ్రీ మరింత వార్తల్లో నిలుస్తోంది. ఈ హీరో స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ ఫుల్ రొమాన్స్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్. రామ్, భాగ్యశ్రీ పీకల్లోతూ ప్రేమలో మునిగితేలున్నారనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ వార్తలను ఇంతవరకు వీరిద్దరు కొట్టిపారేయాలేదు. అలా అని రిలేషన్ ఉన్నట్టు చెప్పడం లేదు. ఈ రూమర్స్ విని విననట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న రామ్ కూడా తన ప్రేమయానం గురించి పెదవి విప్పలేదు. చిన్న నవ్వు నవ్వి ప్రశ్నను దాటేశాడు. అయితే తాజాగా ఓ ఇంటర్య్వూలో భాగ్యశ్రీ తన లవ్ లైఫ్ పై ఒపెన్ కామెంట్స్ చేసింది.
Also Read: Tamil Actress: కమిట్మెంట్ అడిగాడు.. ధనుష్ మేనేజర్ పై నటి సంచలన కామెంట్స్
తను నటించిన కాంత మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భాగ్యశ్రీ.. ఓ యూట్యూబ్ ఛానల్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్ సెషన్ లో భాగంగా లవ్ మ్యారేజ్? ఆరెంజ్డ్ మ్యారేజ్ అని ప్రశ్నించగా.. ప్రేమ వివాహమే అని ఒపెన్ గా చెప్పేసింది. ప్రస్తుతం ప్రేమలో ఉన్నారంటే.. అవును, లేదన్నట్టుగా డైలామాలో పడేసింది అందరిని. ఇప్పుడు లేకపోవచ్చు.. కానీ, భవిష్యత్తులో ప్రేమ రావచ్చు అంటూ అభిమానులను సందేహంలో పడేసింది. దీంతో రామ్ పోతినేని లవ్ గురించి ఆమె పరోక్షంగా స్పందించింది. ప్రస్తుతం వీరిద్దరు లవ్ ఉన్నారని, ఫ్యూచర్ గురించి ఇంకా క్లారిటీ లేదమో అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఆమె ఈ వీడియోకి నెటిజన్స్ అంత కూడా రామ్ పోతినేని పేరుని కామెంట్స్ చేస్తుంది. మరి తన ప్రేమ, పెళ్లిపై ఈ భామ ఎప్పుడు డైరెక్ట్ చెబుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==