E-Paper
Advertisement

BMW film Censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి..

BMW film Censor: సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి..
Advertisement

BMW Censor: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఎన్నో సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే మరికొన్ని గంటలలో చిరంజీవి హీరోగా నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి. ఈ సినిమాతో పాటు రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi)సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

కిషోర్ తిరుమల డైరెక్షన్..

కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ, డింపుల్ హైయతి, ఆశికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఇకపోతే ఈ సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..

Advertisement

తాజాగా ఈ సినిమాకు సెన్సార్ పూర్తి కావడంతో సెన్సార్ బోర్డు ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా 2 గంటల 22 నిమిషాల రన్ టైం లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమాకు ఏ విధమైనటువంటి సెన్సార్ సమస్యలు లేకుండా సెన్సార్ క్లియరెన్స్ కూడా రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక రెండు రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాపై రవితేజ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో హిట్ కొట్టేనా?

Advertisement

గత కొద్దిరోజులుగా విభిన్న కథ నేపథ్యంలో రవితేజ నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఆ సినిమాలు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ద్వారా హిట్ కొట్టడానికి రవితేజ సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమా అప్డేట్ చూస్తుంటే కచ్చితంగా ఈసారి సక్సెస్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాలో రోషన్, గెటప్ శ్రీను, సునీల్ వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా భారీ పోటీ నడుమ విడుదల కాబోతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి రవితేజకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: BMW Pre Release: జన్మ ,పునర్జన్మనిచ్చింది మీరే.. రవితేజ  పై హరీష్ శంకర్ కామెంట్స్

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×