E-Paper
Advertisement

BMW Pre Release: జన్మ ,పునర్జన్మనిచ్చింది మీరే.. రవితేజ  పై హరీష్ శంకర్ కామెంట్స్

BMW Pre Release: జన్మ ,పునర్జన్మనిచ్చింది మీరే.. రవితేజ  పై హరీష్ శంకర్ కామెంట్స్
Advertisement

BMW Pre Release: మాస్ మహారాజా రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి(BMW Movie). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇదివరకు రవితేజ(Raviteja)తో పనిచేసిన దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.

పునర్జన్మనిచ్చారు..

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రవితేజ గురించి హరీష్ శంకర్ ఎంత గొప్పగా మాట్లాడారు. ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి సక్సెస్ అందుకున్న వారిలో చిరంజీవి ఆయన తర్వాత రవితేజ ఉన్నారని వీరిద్దరూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని, నాకు వీరిద్దరే స్ఫూర్తి అంటూ మాట్లాడారు. తన కెరీర్ కు రవితేజ ఎంతగానో సాయపడ్డారని, నాకు జన్మనిచ్చింది, పునర్జన్మని ఇచ్చింది కూడా రవితేజ అన్నయ్య అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.ఇక వీరిద్దరి కాంబినేషన్లో మిరపకాయ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అనంతరం మిస్టర్ బచ్చన్ అంటూ మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచిందని, త్వరలోనే రవితేజతో మరో సినిమా ఉంటుందని హరీష్ శంకర్ తెలియజేశారు.

మిరపకాయ్ మూవీ సెంటిమెంట్ రిపీట్..

Advertisement

భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా గురించి కూడా మాట్లాడుతూ రవితేజతో తాను మిరపకాయ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాను ఈ సినిమా సరిగ్గా సంక్రాంతి పండుగ సమయంలోనే జనవరి 13వ తేదీ విడుదల అయింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిందని ఇప్పుడు తిరిగి అదే రోజున భర్త మహాశయులకు విజ్ఞప్తి విడుదల కాబోతోంది. ఈ సినిమా కూడా పక్క సూపర్ హిట్ అంటూ హరీష్ శంకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ కూడా మంచి అంచనాలను పెంచాయి. గత కొద్ది రోజులుగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రవితేజకు ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ ఇస్తుందని స్పష్టం అవుతుంది.

నిరాశపరిచిన మాస్ జాతర..

Advertisement

ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పాటలు కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచాయి. రవితేజ మాస్ జాతర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాలు నడుమ విడుదలైనప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఈ సినిమాలో రవితేజకు జోడిగా డింపుల్ హైయతి, ఆశికా రంగనాథ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: BMW Pre Release: ఇది మీరు పెట్టిన బిక్షే..డైరెక్టర్ బాబీ ఎమోషనల్ కామెంట్స్!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×