E-Paper
Advertisement

Tirumala: తిరుమల తిరుపతి తాగునీటి సమస్యకు చెక్.. త్వరలో వెంకన్న పాదాలను తాకనున్న కృష్ణమ్మ..

Tirumala: తిరుమల తిరుపతి తాగునీటి సమస్యకు చెక్.. త్వరలో వెంకన్న పాదాలను తాకనున్న కృష్ణమ్మ..
Advertisement

Tirumala: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా, తిరుపతి – చంద్రగిరి ప్రాంతాల రూపురేఖలు మార్పు.. అయితే ఇప్పుడు తిరుమల – తిరుపతి నగరాల తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా, చంద్రగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా నీవా బ్రాంచి కెనాల్ ద్వారా కృష్ణా జలాలను కళ్యాణి డ్యామ్‌కు తరలించే చారిత్రాత్మక ఘట్టం ఆరంభం కానుంది. ఈ నెల 13వ తేదీన మూలపల్లె చెరువు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 2014లోనే ఆయన దీనికి రూపకల్పన చేసినప్పటికీ, మధ్యలో నిలిచిపోయిన పనులకు కూటమి ప్రభుత్వం మళ్ళీ జీవం పోసింది.

ఈ ప్రాజెక్టులో భాగంగా నీవా బ్రాంచి కెనాల్ 53వ కిలోమీటర్ వద్ద అత్యాధునిక లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుండి దాదాపు 33 కిలోమీటర్ల మేర భారీ పైప్‌లైన్ నిర్మించి, కృష్ణా జలాలను నేరుగా కళ్యాణి డ్యామ్‌కు తరలిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.126 కోట్లు కేటాయించగా, హంద్రీనీవా, నీవా బ్రాంచి కెనాల్స్ ఆధునీకరణకు కలిపి మొత్తం రూ.1,329 కోట్ల భారీ వ్యయం చేయనున్నారు. భూగర్భ పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించడం వల్ల నీటి వృధా తగ్గడమే కాకుండా, భూసేకరణ సమస్యలు కూడా తక్కువగా ఉంటాయి.

Advertisement

తాగునీటి కష్టాలకు చెక్..

ప్రతి ఏటా సుమారు 450 ఎంసీఎఫ్‌టీ (MCFT) నీటిని కళ్యాణి డ్యామ్‌కు తరలించడం ద్వారా డ్యామ్‌లోని నీటి నిల్వను నిరంతరం స్థిరీకరిస్తారు. దీనివల్ల తిరుమల శ్రీవారి భక్తులతో పాటు, తిరుపతి నగరంలోని సుమారు 5 లక్షల మంది జనాభాకు శాశ్వతంగా తాగునీటి కష్టాలు తీరనున్నాయి. గతంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కళ్యాణి డ్యామ్ అడుగంటి, తిరుపతి నగరం నీటి ఎద్దడిని ఎదుర్కొనేది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి, వేసవిలో కూడా పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుంది.

Advertisement

అన్నదాతకు అండ..
అయితే కేవలం తాగునీటికే పరిమితం కాకుండా, ఈ ప్రాజెక్టు చంద్రగిరి మండలంలోని రైతాంగానికి వరప్రదాయిని కానుంది. మార్గమధ్యంలో ఉన్న 5 ప్రధాన చెరువులను కృష్ణా జలాలతో నింపడం ద్వారా భూగర్భ జల మట్టం పెరుగుతుంది. దీనివల్ల సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి రానుంది. నీరు లేక ఎండిపోతున్న పొలాలకు ఈ ప్రాజెక్టు కొత్త ఊపిరి పోస్తుందని, తద్వారా స్థానిక రైతులు వాణిజ్య పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: జర భద్రం.. ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మంజా.. 

రెండేళ్లలో లక్ష్యం 
ఈ ప్రాజెక్టును అత్యంత వేగంగా, అంటే వచ్చే రెండేళ్ల కాలంలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో (Action Plan) ముందుకు వెళ్తోంది. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, రాయలసీమకు కృష్ణమ్మ జలాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ పనుల వల్ల స్థానికంగా కూలీలకు, యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, పారిశ్రామికంగా, పర్యాటక రంగంలో కూడా తిరుపతి పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.

Related News

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

Big Stories

Advertisement
×